నేటి నుంచి నగరంలో కొవిడ్‌ వ్యాక్సినోత్సవం

ABN , First Publish Date - 2021-04-11T05:09:38+05:30 IST

నగరంలోని వార్డు సచివా లయాల్లో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు కొవిడ్‌ వ్యాక్సి నోత్సవాన్ని నిర్వహించనున్న ట్టు నగర పాలక సంస్థ కమిష నర్‌ డి.చంద్రశేఖర్‌ తెలిపారు.

నేటి నుంచి నగరంలో కొవిడ్‌ వ్యాక్సినోత్సవం
సచివాలయ ఉద్యో గులతో సమీక్షిస్తున్న కమిషనర్‌ చంద్రశేఖర్‌

ఏలూరు టూటౌన్‌, ఏప్రిల్‌ 10: నగరంలోని వార్డు సచివా లయాల్లో ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు కొవిడ్‌ వ్యాక్సి నోత్సవాన్ని నిర్వహించనున్న ట్టు నగర పాలక సంస్థ కమిష నర్‌ డి.చంద్రశేఖర్‌ తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేసే కార్య క్రమంలో భాగంగా నాలుగు రోజుల పాటు అత్యధిక మందికి టీకాలు వేయను న్నామన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం సచివాలయ ఉద్యో గులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లకు పైబడిన వారంతా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. గాంధీనగర్‌లో ఐకేపీ భవన్‌ సచివాలయంలో, మోతే వారితోట, ఆర్‌ఆర్‌ పేట పార్కు, ఎరకుల కాలనీ బృం దావనం పార్కు, శాంతినగర్‌, ఎన్‌ఆర్‌పేట ఇండోర్‌ స్టేడియం, అశోక్‌ నగర్‌, ఫిరంగుల దిబ్బ, శేఖర్‌వీధి, గన్‌బజార్‌, కొత్తపేట, పవర్‌పేట, చేపలతూము సచి వాలయాల్లో టీకాలు వేస్తారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ కె. వెంకటేశ్వరరావు, హెల్త్‌ ఆఫీసర్‌ గోపాల్‌ నాయక్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-11T05:09:38+05:30 IST