కాంట్రాక్టు స్టాఫ్‌నర్సుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-06-13T05:26:06+05:30 IST

కాంట్రాక్టు స్టాఫ్‌నర్సుల సమస్యలను పరిష్కరిం చాలని, సమస్య పరిష్కారం కాకపోతే ఈనెల 14వ తేదీ నుంచి దశలవారీగా ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌నర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీరాణి, ట్రెజరర్‌ వేణుగోపాల్‌, సీఐటీయూ నాయకులు డీఎన్‌వీడీ ప్రసాద్‌ చెప్పారు.

కాంట్రాక్టు స్టాఫ్‌నర్సుల సమస్యలు పరిష్కరించాలి

రేపటి నుంచి దశలవారీగా ఉద్యమం

 కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌నర్స్‌ యూనియన్‌ వెల్లడి

ఏలూరు క్రైం, జూన్‌  12 : కాంట్రాక్టు స్టాఫ్‌నర్సుల సమస్యలను పరిష్కరిం చాలని, సమస్య పరిష్కారం కాకపోతే ఈనెల 14వ తేదీ నుంచి దశలవారీగా ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌నర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీరాణి, ట్రెజరర్‌ వేణుగోపాల్‌, సీఐటీయూ నాయకులు డీఎన్‌వీడీ ప్రసాద్‌ చెప్పారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో శనివారం ఉదయం అన్ని విభాగాల్లోని నర్సులను కలిసి ఉద్య మానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆస్పత్రిలోని నర్సింగ్‌ సూపరింటెండెంట్లకు కరపత్రాలను అందించి తమ సమస్యలను తెలిపారు. కరోనా వైరస్‌ రెండవ దశలో కరోనా సోకి మరణించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సులను కుటుం బాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వారి కుటుంబాలకు రూ.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిం చాలి. కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ నర్సులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈనెల 14వ తేదీన నల్లబ్యాడ్జీలతో నిరసన, 15వ తేదీన డిమాండ్స్‌ డేగాను, 16వ తేదీన విధి నిర్వహణలో చ నిపోయిన నర్సింగ్‌ ఆఫీసర్లకు నివాళులు, 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు ఈ–మెయిల్స్‌ పంపడం,  18వ తేదీన మండల కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల వద్ద ధర్నా లు, దీక్షలు, జూన్‌ 28వ తేదీ నుంచి సహాయ నిరాకరణ, సమ్మె చేపట్టనున్నట్టు వివరించారు.  

Updated Date - 2021-06-13T05:26:06+05:30 IST