పర్యవేక్షణ కరువై..!

ABN , First Publish Date - 2022-01-28T05:19:56+05:30 IST

అధికారుల పర్యవేక్షణ లేక లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాలు కాస్తా పాడుబడి నిరుపయోగంగా శిథిలా వస్థకు చేరుకుంటున్నాయి.

పర్యవేక్షణ కరువై..!
పోణంగిలోని కమ్యూనిటీ హాలు

నిరుపయోగంగా కమ్యూనిటీ హాలు
లక్షలాది రూపాయలు ప్రజాధనం వృథా

ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 27: అధికారుల పర్యవేక్షణ లేక లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాలు కాస్తా పాడుబడి నిరుపయోగంగా శిథిలా వస్థకు చేరుకుంటున్నాయి. ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని పోణంగి చిన దళితవాడలో 2011 జూలై 20న రూ.మూడు లక్షల సీడీపీ నిధులతో ఏపీ పంచా యతీరాజ్‌ శాఖ కమ్యూనిటీ హాలును ప్రధాన రహదారి పక్కనే అంబేడ్కర్‌, వైఎస్సార్‌ విగ్రహాల సమీపంలో నిర్మించారు. ఈ భవనానికి రెండు ద్వారాలు, నాలుగు కిటికీలు ఏర్పాటు చేశారు. ఫ్లోరింగ్‌ కూడా ఆకర్షణీయంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ కమ్యూనిటీ హాలును కొంత కాలంగా వినియోగించడం లేదు. దీంతో నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనానికి కొద్దిపాటి మరమ్మతులు నిర్వహించి ఫ్లోరింగ్‌లు, దర్వాజాల కింది భాగంలో దెబ్బతిన్న ఫ్లోరింగ్‌లు, లోపలి భాగంలో దెబ్బతిన్న ఫ్లోరింగ్‌లకు మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకొస్తే ఉపయోగ కరంగా ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. కమ్యూనిటీ హాలుగా లేదా ఏదైనా ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని స్థాని కులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చర్యలు తీసుకుని ఈ కమ్యూనిటీ హాలును వినియోగంలోకి రావాలని కోరుతున్నారు.



Updated Date - 2022-01-28T05:19:56+05:30 IST