జనవరి ఒకటికి 18 ఏళ్లు నిండితే..

ABN , First Publish Date - 2021-11-30T05:39:07+05:30 IST

వచ్చే జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కోరా రు.

జనవరి ఒకటికి 18 ఏళ్లు నిండితే..
అవగాహన ర్యాలీలో కలెక్టర్‌ మిశ్రా, జేసీలు

ఓటరుగా నమోదు చేసుకోవాలి : కలెక్టర్‌
ఏలూరు కలెక్టరేట్‌, నవంబరు 29 : వచ్చే జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కోరా రు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌ నుంచి ఫైర్‌స్టేషన్‌ వరకు నిర్వహించిన ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా బెలూన్లు ఎగురవేసి మోటారు సైకిల్‌ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. స్విప్‌ కార్యక్రమం, ఓటరు జాబితా స్వచ్ఛీకరణ చేయాలన్నారు. చనిపోయిన వారిని ఓటరు జాబితా నుంచి తొల గించాలని, తప్పొప్పులను సవరించాలని సూచించారు. జేసీలు హిమాన్షు శుక్లా, సూరజ్‌ గానోరె, పద్మావతి, జడ్పీ సీఈవో హరిహర నాఽథ్‌, డీపీవో రమేష్‌బాబు, ఆర్డీవో రచన, మునిసిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.


స్పందనకు 302 దరఖాస్తులు
కలెక్టరేట్‌ స్పందనకు సోమవారం 302 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 111 రెవెన్యూ శాఖవి కాగా, 34 పెన్షన్లు, 28 పీఆర్‌, మరో 24 పోలీస్‌ శాఖ, తొమ్మిది మునిసిపాల్టీ, ఎనిమిది దరఖాస్తులు పౌరసరఫరాల శాఖకు సంబంధించినవి వచ్చినట్టు కలెక్టర్‌ కార్తికేయ తెలిపారు. వీటిని సకాలంలో పరిష్కరిస్తామన్నారు. 

Updated Date - 2021-11-30T05:39:07+05:30 IST