ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో సదుపాయాలు మెరుగుపర్చాలి : కలెక్టర్‌ మిశ్రా

ABN , First Publish Date - 2021-07-24T06:07:37+05:30 IST

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో మౌలిక సదు పాయాలు మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారు లను ఆదేశించారు.

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో సదుపాయాలు మెరుగుపర్చాలి : కలెక్టర్‌ మిశ్రా

బుట్టాయగూడెం, జూలై 23 : ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో మౌలిక సదు పాయాలు మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారు లను ఆదేశించారు. శుక్రవారం కేఆర్‌ పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో అధికారు లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాలనీల్లో పారిశుధ్యం మెరుగుపర్చడంతోపాటు విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలకు గోదావరికి వరద ఉధృతి పెరిగే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆయా గ్రామాలు, నిర్వాసితుల కుటుంబాల్లో గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశిం చారు. వర్షాలకు పాడైన రహదారులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. గోదావరి వరద ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, నోడల్‌ ఆఫీసర్లను నియమించినట్టు ఐటీడీఏ  పీవో  ఆనంద్‌ కలెక్టర్‌కు వివరించారు. ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డీఎస్పీ లతాకుమారి, జంగారెడ్డిగూడెం, పోలవరం, కుక్కునూరు, బుట్టాయగూడెం మండలాల తహసీల్దార్లు, విద్య, వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్‌, ఉపాధి, ఐసీడీఎస్‌, డీఆర్‌డీఏ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-24T06:07:37+05:30 IST