పసర్లు పట్టిన పంచాయతీ చెరువు

ABN , First Publish Date - 2021-07-30T04:56:45+05:30 IST

గ్రామానికి చెందిన ఖాళీ ప్రదేశాల్లో, ఇళ్ల చుట్టూ, ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, లేకుంటే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారినపడే ప్రమాదముందంటూ డెంగీ నిరోధక మాసోత్సవాలు, డ్రై డేల పేరిట వైద్యాధికారులు గ్రామాల్లో అవగాహన కార్య క్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు..

పసర్లు పట్టిన  పంచాయతీ చెరువు
పసర్లు తేలిన చెరువు..

పెదపాడు, జూలై 29 : గ్రామానికి చెందిన ఖాళీ ప్రదేశాల్లో, ఇళ్ల చుట్టూ, ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, లేకుంటే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల బారినపడే ప్రమాదముందంటూ డెంగీ నిరోధక మాసోత్సవాలు, డ్రై డేల పేరిట వైద్యాధికారులు గ్రామాల్లో అవగాహన కార్య క్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.. అయితే గ్రామంలో మధ్యలో పసర్లు తేలి చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధ భరింతంగా మారిన చెరువు కన్పించక పోవడం విడ్డూరంగా ఉందని కొత్తూరు గ్రామస్థులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1.30 ఎకరాల్లో విస్తరించిన పంచాయతీ చెరువును గతంలో నామమాత్రపు రుసుంతో లీజుకు ఇచ్చేవారు. గతంలో చెరువు అభివృద్ధిలో భాగంగా ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో చెరువు చుట్టూ రిటైనింగ్‌వాల్‌ నిర్మాణం చేపట్టారు. అయితే చెరువు పరిసరాల్లో ఇళ్ల నుంచి వచ్చే మురుగు వెళ్లేందు కు డ్రెయినేజీ ఏర్పాటు లేకపోవడంతో వారంతా మురుగునీటిని పైపుల ద్వారా చెరువులోకి విడిచిపెడుతున్నారు. అలాగే చెరువు నిర్వహణ లేకపోవడంతో నీరంతా పసర్లు పట్టి పసరు కోనేరుగా మారి పోయింది. దీంతో నిల్వ ఉన్న నీటిలో దోమల ఉధృ తి పెరిగి తద్వారా వ్యాధుల బారినపడతామని పలువురు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధి కారులు తక్షణం స్పందించి చెరువును పూర్తిస్థాయి లో మెరుగుపర్చాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-07-30T04:56:45+05:30 IST