సెల్‌ చార్జింగ్‌.. టెన్షనే లేదు..!

ABN , First Publish Date - 2021-03-08T05:46:30+05:30 IST

నేడు సెల్‌ఫోన్‌ లేనిదే మనిషి మనుగడ లేదంటే అతిశయోక్తి కాదు.

సెల్‌ చార్జింగ్‌.. టెన్షనే లేదు..!
పొలాల్లో ఏర్పాటు చేసుకున్న సోలార్‌ ఫలక


( పెదపాడు)

 నేడు సెల్‌ఫోన్‌ లేనిదే మనిషి మనుగడ లేదంటే అతిశయోక్తి కాదు. ఎక్కడికి వెళ్లినా వెం ట సెల్‌ఫోన్‌ ఉండాల్సిందే.  దూర ప్రాంతం వెళ్లిన ప్పుడు సెల్‌ చార్జింగ్‌ పెద్ద సమస్యే. సంచార జీవనం సాగిం చే వారికి ఇది మరింత ఇబ్బందే. అయితే గొర్రెలు, మేకల పెంపకం ద్వారా జీవనోపాధిని పొందుతూ పంట పొలాల వెంబడి గ్రామ గ్రామాన తిరిగే పెదవేగి మండ లానికి చెందిన ఓ కుటుంబం సుమారు రూ.10 వేలు ఖర్చుతో సోలార్‌ ఫలకను కొనుగోలు చేసి, దానిని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేసేందుకు బ్యాటరీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకేముందీ జీవనోపాధిలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా, అక్కడ పంటపొలాల్లో ఎన్ని రోజులు నివాసమున్నా సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ సమస్యే లేదు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడమంటే ఇదేనేమో.  



Updated Date - 2021-03-08T05:46:30+05:30 IST