కరోనా వ్యాక్సిన్‌ నిండుకుంది..!

ABN , First Publish Date - 2021-04-13T05:02:12+05:30 IST

టీకా దినోత్సవం అంటూ ఆ ర్భాటంగా ప్రచారం చేశారు.

కరోనా వ్యాక్సిన్‌ నిండుకుంది..!
వ్యాక్సిన్‌ అయిపోవడంతో లెక్కలు చూసుకుంటున్న వైద్య సిబ్బంది

 ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 60 మందికే వ్యాక్సిన్‌ 

 నిరాశతో వెనుదిరిగిన జనం

 రెండో డోసు వారిలో ఆందోళన


ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 12: టీకా దినోత్సవం అంటూ ఆ ర్భాటంగా ప్రచారం చేశారు. దీంతో అనేక మంది మొదటి డోసు కోసం ఆస్పత్రికి వచ్చారు. మరోవైపు  ఇప్పటికే మొ దటి డోసు వేయించుకున్న పలువురు రెండో డోసు కోసం ఆస్పత్రికి వచ్చారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని కరోనా వ్యాక్సిన్‌ విభాగాని కి అనేక మంది సోమవారం ఉదయం చేరుకున్నారు. కేవలం ఆరు వైల్స్‌ (ఆరు బాటిల్స్‌) మాత్రమే వ్యాక్సిన్‌ పంపించడంతో ఒక్కొక్క వైల్‌ పది మం దికి వస్తోంది. ఈ విధంగా కేవలం 60 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ చేసి అక్కడ సిబ్బంది చేతులు ఎత్తేశారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా వేయించుకోవచ్చని ప్రచారం భారీ గా సాగడంతో అనేకమంది ప్రభుత్వా స్పత్రికి వచ్చారు. వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తాదో తాము చెప్పలేమని అక్కడ సిబ్బంది చెప్పారు. ఇప్పటి వరకూ ఏలూరు ప్రభుత్వా స్పత్రిలో 5,500 మందికి పైగా వ్యాక్సిన్‌ వేశారు. ఇది లా ఉండగా సోమవారం మధ్యాహ్నానికి జిల్లాలో కరో నా వ్యాక్సిన్‌ పూర్తిగా అయిపోయినట్టు చెబుతున్నారు. మొదటి డోసు వేయిం చుకున్న వారు ఇప్పటికే ఏడు వారాలు అయిపోయిందని ఒకవారం మాత్రమే గడువు ఉందని ఈవారంలో రెండోడోసు వారికి ప్రాధాన్యత క ల్పించాలంటూ కోరుతున్నారు. పోలీస్‌ శాఖలో అనేక మంది ఆసుపత్రికి రెండో డోసు కోసం వచ్చి వ్యాక్సిన్‌ లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. తమకు పర్మిషన్‌ ఇవ్వడం లేదని వారు వాపోయారు. జిల్లాలో ఏసీబీ డీ ఎస్పీగా, ఒంగోలు పీటీసీ డీఎస్పీగా పని చేస్తున్న ఎం.సుధాకరరావు మరి కొంత మంది పోలీసు అధికారులు సోమవారం వ్యాక్సిన్‌ వేయించు కున్నారు.   

Updated Date - 2021-04-13T05:02:12+05:30 IST