కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-04-17T05:13:13+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ అందరినీ కలవరపెడుతోంది.

కరోనా కలకలం
పార్శిల్‌ కార్మికులకు అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 16 : 

 కరోనా సెకండ్‌ వేవ్‌ అందరినీ కలవరపెడుతోంది. క్రమేపీ గ్రామాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏలూరు రూరల్‌ మండలం శనివారపు పేట, వెంకటాపురం,  పెదపాడు మండలం కొత్తూరులో తాజాగా కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు అధికారులూ అప్రమత్తమై కరోనా సోకకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.  45 ఏళ్లు నిండినవారు వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటూ కోరుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. స్వీయ రక్షణతోనే కరోనా సోకకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చంటూ  హితబోధ చేస్తున్నారు. 



మండలంలోని రెండు గ్రామాల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఇటీవల పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం అందిన ఫలితాల్లో శనివారపుపేటలో మూడు, వెంకటాపురం ఒకటి పంచాయతీల్లో పలు కేసులు నమోదయినట్టు సమాచారం. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఉలిక్కిపడ్డారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండగా తీవ్ర ప్రయత్నాలు చేస్తు న్నారు. ఇటీవల శని వారపుపేటలోని ఓ పాఠశాలలో పదిమంది విద్యార్థులు కరో నా బారిన పడిన సంగతి తెలిసిందే. వైరస్‌ సోకిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు పా టించకుండా ప్రజల్లో సంచరిస్తుండడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, బయటకు వచ్చిన ప్పుడు మాస్క్‌లు, భౌతిక దూరం పాటించడం, చేతులకు శానిటైజర్‌ రాసుకోవాల ని వైద్యాధికారి దేవ్‌ మనోహర్‌ కిరణ్‌ సూచించారు. కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రంగా ఉంటుందని గ్రామాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండేలా చైతన్య పర్చాలని కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌  సోమశేఖర్‌ సూచించారు. 


కొత్తూరులో నాలుగు పాజిటివ్‌ కేసులు

పెదపాడు, మార్చి 16 : కొత్తూరులో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో శుక్రవారం నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వట్లూరు పీహెచ్‌సీ డాక్టరు భారతి తెలిపారు. పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో గ్రామంలో పారిశుధ్య పరిస్థితులు నిర్వహించడంతో పాటుగా ప్రైమరీ, సెకండరీల గుర్తింపు, పరీక్షలు నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. 


వ్యాక్సిన్‌తోనే కరోనాపై యుద్ధం 

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 16 : కరోనా వైరస్‌ తీవ్రతను తట్టుకోవడానికి కొవిడ్‌– 19 వ్యాక్సిన్‌ ఆయుధంగా ఉప యోగపడుతుందని ఏలూరు తహసీల్దార్‌, కొవిడ్‌ టాస్క్‌ఫో ర్స్‌ చైర్మన్‌ బి.సోమశేఖర్‌ అ న్నారు. వెంకటాపురం పంచాయతీ హనుమాన్‌నగర్‌ సచివాలయం–5లో శుక్ర వారం టీకా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వ్యాక్సిన్‌ తీసుకునే వారి వివరాలను, ఆన్‌లైన్‌లో నమోదు చేసే సచివాలయ సిబ్బందిని, అబ్జర్వేషన్‌ రూమ్‌లో పర్యవేక్షిస్తున్న వైద్యులతో మాట్లాడారు. ప్రతి కేంద్రంలో ప్రతిరోజు 200 మందికిపైగా వ్యాక్సిన్‌ వేసేలా లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. 



 ఆ బాధ్యత..స్కూలు బస్సు డ్రైవర్లదే

ఏలూరు క్రైం,ఏప్రిల్‌ 16: కరోనా వైరస్‌ విద్యార్థులకు సోకకుండా అత్యంత జాగ్ర త్తలు తీసుకోవాల్సిన బాధ్య త స్కూల్‌ బస్సు డ్రైవర్లపై ఎంతో ఉందని జిల్లా ఆర్ము డు రిజర్డు అదనపు ఎస్పీ ఎం.మహేష్‌కుమార్‌ అన్నారు. ఏలూరు సురేష్‌ చంద్ర బహుగుణ స్కూలు ఆవరణలో నగరంలోని స్కూలు బస్సు డ్రైవ ర్లతో కరోనా వైరస్‌పై అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా   అదనపు ఎస్పీ హాజరై మాట్లా డుతూ కరోనా సెకండ్‌ వేవ్‌ అత్యంత వేగంగా విజృంభిస్తోందని, మనం తీసు కునే జాగ్రత్తలతోనే వైరస్‌కు దూరం కావొచ్చ న్నారు. ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ను నిర్మూలించే విషయంలో ప్రజలం దరూ భాగస్వాములు కావాలని, బస్సు డ్రైవర్లు, విద్యార్థులు మాస్క్‌ లేకుండా బస్సులో ప్రయాణించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏలూరు వన్‌ టౌన్‌ సీఐ వై.బాలరాజాజీ, ఆర్‌ఐలు అంకమరావు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ బొద్దాని శ్రీనివాస రావు, ఉమెన్‌ ఆర్‌ఎస్‌ఐ ఇందుమతి పలువురు పాల్గొన్నారు. 



 మీ జాగ్రత్తే...... మీ కుటుంబానికి శ్రీరామరక్ష 

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 16: కరోనా వైరస్‌ సోక కుండా మీరు తీసుకునే జా గ్రత్తలే మీ కుటుంబానికి శ్రీరామరక్షగా ఉంటాయని ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ అన్నారు. కొత్త బస్టాండ్‌ లోని పార్శిల్‌ కార్మికులతో సమావేశం నిర్వహించి వారికి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలను డీఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మీకు కుటుంబం ఉందని గుర్తు పెట్టుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో  మాస్క్‌ను తీయకుండా చూసు కుంటే కరోనా బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. కనీసం 30 నిముషా లకు ఒకసారి అయినా చేతులను శుభ్రపర్చుకోవాలని, భౌతిక దూరం పాటించా లన్నారు. పార్శిల్స్‌ ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటాయని వాటిపైన ఎన్నో సూక్ష్మ జీవులు ఉంటాయని వాటిని తాకిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తే తమతో పాటు తమ కుటుంబ సభ్యుల ను కూడా ప్రమాదంలో పడవేసిన వారు అవుతారన్నారు. 

Updated Date - 2021-04-17T05:13:13+05:30 IST