కన్నీటి వ్యథలు

ABN , First Publish Date - 2021-05-06T05:57:18+05:30 IST

కరోనా బారినపడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలువురు బుధవారం మృతి చెం దారు.

కన్నీటి వ్యథలు

  కుటుంబాల్లో కరోనా మిగిల్చిన కల్లోలం

బుట్టాయగూడెం/పెదపాడు/ఆకివీడు/పాలకొల్లు రూరల్‌,  మే 5 : కరోనా బారినపడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలువురు బుధవారం మృతి చెం దారు. బుట్టాయగూడెం మండలం గుర్రప్పగూడెంకు చెం దిన ఇద్దరు గిరిజన మహిళలు కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించారు. వీరిని ముందుగా జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రిలోని కొవిడ్‌ కేర్‌ సెంటరుకు పంపించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు మండల పరిషత్‌ అధికారులు తెలియజేశారు. ఒకే రోజున ఇద్దరు మహిళల మృతితో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నా యి. పెదపాడు మండలం కలపర్రు, వీరమ్మకుంట గ్రా మాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా బారిన పడి, ఏలూరు ఆశ్రంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆకివీడు మండలం మాదివాడకు చెందిన 46 ఏళ్ల ఓ వ్యక్తి ఏలూరు ఆశ్రంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇరగవరం మండలం ఏలేటిపాడుకు చెందిన ఓ వ్యక్తి కరోనా తో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు వై.యశోద తెలిపారు. 


మొన్న కొడుకు.. నేడు తల్లి

ఆకివీడుకు చెందిన కమ్యూనిస్టు నేత మారుబోయిన లెనిన్‌బాబు మృతి చెందిన మూడో రోజే ఆయన తల్లి సావిత్రమ్మ(81) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. లెనిన్‌బాబు కాలం చేసినట్టు తెలి యకుండానే ఈమె మరణించడం అందరి హృదయాలను కలిచివేసింది. ఆకివీడులో గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. సీపీఎం, ఐద్వా, సీఐటీయూ, ప్రజా సంఘాలకు అనేక సేవలందించి వాళ్ల కోసం పోరాటాలు చేసిన మహిళ సావిత్రమ్మ. ఆవిడ మరణం గ్రామానికి తీరనిలోటు. జిల్లా, మండల నేతలు నివాళులర్పించి సంతాపం తెలిపారు. 


వారంలో తల్లి, కొడుకు, కోడలు మృతి

కరోనా కాటుకు కుటుంబమే బలైంది. పాలకొల్లు మం డలం వడ్లవానిపాలెం పంచాయతీ పరిధిలోని గొల్లవాని చెరువులో బోళ్ల సుబ్బమ్మ(85) ఏప్రిల్‌ 29న కరోనాతో ఇం టిలోనే మృతి చెందారు. అప్పటికే కరోనాతో బాధపడుతూ ఆమె కుమారుడు భీమవరంలోను, కోడలు పాలకొల్లులోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. తల్లి సుబ్బమ్మ మృతి చెందిన నాలుగు రోజులకు సత్యప్రసాద్‌ (63) మృతి చెందగా, మరో రెండు రోజులకు కోడలు ప్రసూన (56) మృతి చెందడంతో వారం వ్యధిలోనే కుటుంబం మొత్తం కరోనా కాటుకు బలైంది. సత్యప్రసాద్‌ పెద్ద కుమార్తె లండన్‌లోను, చిన్న కుమార్తె తణుకులోను ఉన్నప్పటికీ నానమ్మ, తల్లిదండ్రుల కడసారి చూపునకు నోచుకోలేదని తల్లడిల్లుతున్నారు. ఈ మరణాలతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. 


నెల రోజుల్లో తల్లీ కొడుకులు

జంగారెడ్డిగూడెంలో ఓ వ్యాపారి కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు నెలరోజుల వ్యవధిలో తీవ్ర అనా రోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నెల క్రితం అనారోగ్యంతో పెద్ద కుమా రుడు చనిపోగా ఇది జరిగిన మూడో రోజునే తల్లి మృతి చెందింది. ఈ ఘటన మరువక ముందే బుధవారం మరో కుమారుడు మృతి చెందాడు. మరో కుమారుడు అనా రోగ్యంతో చికిత్స పొందుతున్నట్టు చెబుతున్నారు.

Updated Date - 2021-05-06T05:57:18+05:30 IST