3 రోజులుగా నూతిలోనే..

ABN , First Publish Date - 2021-04-17T05:20:48+05:30 IST

ఆకివీడు మండలం అజ్జమూరుగరువులో మూడు రోజులుగా గేదె కనిపించడం లేదని యజమాని బుంగా ప్రభుదాస్‌ అన్నిచోట్ల వెతికాడు.

3 రోజులుగా నూతిలోనే..
నూతిలో గేదె

 ఆకివీడు రూరల్‌ :  

ఆకివీడు మండలం అజ్జమూరుగరువులో మూడు రోజులుగా గేదె కనిపించడం లేదని యజమాని బుంగా ప్రభుదాస్‌ అన్నిచోట్ల వెతికాడు. చివరకు శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన.. పంట కాలువలో నుంచి నీటిని తోడేందుకు ఏర్పాటుచేసిన రక్షణ లేని నూతిలో ఇది కనిపించింది. ఇది పది అడుగుల లోతు.. మూడు అడుగుల వెడల్పు కలిగిన ఈ నుయ్యిలో ఎటూ కదల్లేక.. ఎలా పడిందో.. అలానే ఉండిపోయి నరకయాతన అనుభవిస్తోంది. యజమాని ప్రభుదాస్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు జేసీబీని సహాయంతో మూడు గంటలపాటు శ్రమించి బయటకు తీశారు. అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. మూడు రోజులుగా ఎటువంటి ఆహారం లేకపోవడంతో గేదె నీరసించిపోయింది. వెటర్నరీ ఏడీ సత్య నారాయణ గేదెకు ప్లూయిడ్స్‌తో ప్రాథమిక చికిత్స అందించారు. ఫైర్‌ ఆఫీసర్‌ అజయ్‌కుమార్‌, శ్రీని వాస్‌, అబ్దుల్‌ రియాన్‌, వెంకటేష్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-04-17T05:20:48+05:30 IST