Abn logo
May 17 2021 @ 00:41AM

బ్లాక్‌ ఫంగస్‌ కలకలం

లక్షణాలతో ఇద్దరు అనుమానితులు

నిడదవోలులో అధికారుల పరిశీలన


నిడదవోలు/పెదపాడు, మే 16 : జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం రేపు తోంది. కంటికి సంబంధించిన వ్యాధులతో ఇద్దరు బాధపడుతుండటంతో వీరికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందనే అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతు న్నాయి. నిడదవోలులో కోలపల్లి అంజిబాబు అనే డ్రైవర్‌ కరోనాకు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ సమయంలోనే కన్ను వాసింది. డిశ్చార్జి అనంతరం వాపు మరింత పెరగడంతో ఆందోళన చెందిన కుటుం బీకులు రాజమండ్రి, వైజాగ్‌ ఆసుపత్రులలో చూపించగా సీటీ స్కాన్‌, ఎం ఆర్‌ఐ స్కాన్‌ తీయించారని కన్ను, ముక్కు, మెదడుకు ఫంగస్‌ వ్యాపిస్తుం దని వైద్యులు చెప్పినట్లుగా అంజిబాబు భార్య కళ్యాణి తెలిపారు. తన భర్త ను తన కుటుంబాన్ని ఆదుకోవాలని మెరుగైన వైద్యం చేయించాలని వేడు కొంటున్నారు. దీనితో ఆర్డీవో లక్ష్మారెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో ధర్మరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ కెవి పద్మావతి తదితరులు అతని ఇంటికి వెళ్లి మెడికల్‌ రిపోర్టులను పరిశీలించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపుతామని వారు తెలిపారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్‌ అందే తాతారావు మాట్లాడుతూ కరోనాకు చికిత్స చేసే సమయంలో హైడోస్‌ స్టెరాయిడ్స్‌ ఇవ్వడం వల్ల ఇలాంటి ఫంగస్‌లు బయట పడుతుంటాయ న్నారు. దీనిని లిపో సోమాల్‌ ఎంపో తెరిసిన్‌ బి ఇంజక్షన్‌ ద్వారా తగ్గించ వచ్చునని తెలిపారు. కాకినాడ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చునని ఆయన తెలిపారు.

పెదపాడు మండలం కలపర్రుకు చెందిన మరోవ్యక్తి కొన్ని రోజుల క్రితం టైఫాయిడ్‌ బారినపడడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది ఈ నెల 10న ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాడు. అప్పటికే కంటి నుంచి చిన్నగా నీరు కారుతుండగా, మరో రెండు రోజులు గడిచే సమయానికి వాపు ఎక్కువైంది. దీంతో ఏలూరులోని ఓ కంటి ఆసుపత్రిలో పరీక్ష చేయిం చగా అది బ్లాక్‌ ఫంగస్‌గా అనుమానిస్తూ అవసరమైన ఇంజక్షన్లు, వైద్యా నికి రిఫర్‌ చేశారు. దీనితో బాధితుడు విజయవాడలోని ప్రైవేటు ఆసు పత్రిలో జాయిన్‌ అయ్యాడు. దీనిపై వట్లూరు పీహెచ్‌సీ డాక్టరు భారతిని సంప్రదించగా పూర్తిస్థాయి వైద్య పరీక్షల అనంతరమే ఏ వైరస్‌ అనేది నిర్ధారణ అవుతుందని తెలిపారు. 

 

Advertisement
Advertisement
Advertisement