పనులు సరే..బిల్లులేవీ...

ABN , First Publish Date - 2021-06-14T04:16:01+05:30 IST

మునిసిపాలిటీలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు తలలు పట్టుకున్నారు.

పనులు సరే..బిల్లులేవీ...
మునిసిపల్‌ కార్యాలయం ఎదుట నిర్మించిన సీసీ రోడ్డు

తణుకు, జూన్‌ 13: మునిసిపాలిటీలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు తలలు పట్టుకున్నారు. వివిధ పనులకు సంబంధించి రెండు కోట్ల రుపాయలు వరకు బిల్లులు రావల్సి ఉంది.  సంవత్సర కాలం నుంచి చేసిన పనులకు బిల్లులు రాక పనులకు రుణాలు తెచ్చి పెట్టడం వల్ల వడ్డీలు చెల్లించలేక పోతున్నామని చెబుతున్నారు. రోడ్లు, డ్రెయిన్‌లు, వాటర్‌ పైపులైన్లు, కమ్యూనిటీ భవనాలకు సంబంధించి బిల్లులు రావలసిన వాటిలో ఉన్నాయి. అసలు బిల్లులు ఎపుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉన్నదని వాపోతున్నారు. గతంలో మాదిరిగానే చేసిన పనులకు తగిన విధంగా బిల్లులు వస్తాయని ఆలోచనతో పనులు చేశామని చెబుతున్నారు. అయితే ఆవిధంగా బిల్లులు రాక పోవడంతో చాలా మంది కాంట్రాక్టర్లు కొత్త పనులు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఏ పనులు ముందుకు సాగడంలేదు.


Updated Date - 2021-06-14T04:16:01+05:30 IST