మంత్రిగారా మజాకా!

ABN , First Publish Date - 2022-08-09T06:08:22+05:30 IST

అది జిల్లాలోని ఓ ప్రముఖ వాణిజ్య పట్టణం. ఆ పట్టణంలోని నాలుగు రహ దారుల కూడలి వద్ద బార్‌ ఉంది. అక్కడ బార్‌ ఉంటే అధిక ఆదాయం వస్తుం దని అంతా అనుకుంటారు.

మంత్రిగారా మజాకా!

ఇదో బార్‌ పంచాయితీ
ఓ పట్టణంలో బార్‌ను మార్చేందుకు వీలు లేదంటూ హుకుం
అదేచోట ఉంటే నష్టాలు వస్తాయంటున్న నిర్వాహకులు
మారిస్తే ఓ మంత్రి బంధువు భవనం అద్దెకు ఎసరు?
రంగంలోకి మంత్రిగారు.. అధికారులతో ఒత్తిడి
వేరేచోటుకి మార్చకుండా మంతనాలు
ఇటీవల బార్‌ సిండికేట్‌లో రూ.కోటి వసూలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)
అది జిల్లాలోని ఓ ప్రముఖ వాణిజ్య పట్టణం. ఆ పట్టణంలోని నాలుగు రహ దారుల కూడలి వద్ద బార్‌ ఉంది. అక్కడ బార్‌ ఉంటే అధిక ఆదాయం వస్తుం దని అంతా అనుకుంటారు. అయితే నిత్యం బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయా ణికులు బార్‌కు సమీపంలోనే బస్సులు ఎక్కుతుంటారు. దాంతో బేరాలు అంతగా ఉండడం లేదు. అక్కడ నుంచి బార్‌ తరలించేందుకు నిర్వాహకులు ప్రయత్నిం చారు. తమకు అనుకూలమైన చోట బార్‌ ఏర్పాటు చేసుకోవాలని భావించారు. అయితే వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. బార్‌ తరలించకుండా ఓ మంత్రి రంగంలోకి దిగారు. బార్‌కు... మంత్రికి సంబంధం ఏమిటని అంతా అనుకుం టారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న బార్‌ భవనం మంత్రి బంధువుది. అక్కడనుంచి తరలిపోతే అద్దె పోతుంది. అందుకే పాత చోటనుంచి తరలించకూడదని పట్టు బ ట్టారు. బార్‌ వేరే చోటకు వెళ్లకుండా చూడాలని ఓ అధికారికి హుకుం జారీ చేశా రు. అంతే నిర్వాహకుల ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం ఉన్న చోటే బార్‌ నిర్వహించాల్సి వస్తోంది.


 నిబంధనలు ఇవే...
జిల్లాలో 24 బార్‌లు ఉన్నాయి. పట్టణాల్లోనే అవి విస్తరించి ఉన్నాయి. పట్టణ పరిధిలో ఎక్కడైనా బార్‌ నిర్వహించేందుకు అవకాశం ఉంది. గుర్తింపు పొందిన గుడి, బడి, చర్చి, మసీదు, ఆస్పత్రులకు మాత్రం 100 మీటర్ల దూరంలో ఉండాలి. పట్టణానికి వెలుపల అంటే మూడు కిలో మీటర్ల పరిధిలో ఎక్కడైనా బార్‌ నెలకొల్పుకునే వెసులుబాటు కల్పించారు. అయితే అది 10 వేలు లోపు జనాభా ఉన్న పంచాయతీ అయితే జాతీయ, రాష్ట్ర రహదారికి 220 మీటర్ల దూరంగా, 20 వేలు జనాభా అయితే 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసు కునేలా మార్గదర్శకాలున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్వాహకులు బార్‌ను ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు. కానీ ఆ పట్టణంలో ఓ మంత్రి చెప్పిందే వేదం. డిమాండ్‌ ఉన్న చోటకు తరలించుకుందామని చేసిన ప్రయత్నాలను ఆయ న అడ్డుకున్నారు. అధికారులతో పరోక్షంగా హెచ్చరికలు చేయిస్తున్నారు. భవిష్య త్తులో బార్‌ నిర్వహణలో ఎటువంటి అవరోధాలు సృష్టిస్తారోనన్న ఆందోళనతో నిర్వాహకులు బార్‌ మార్పును విరమించుకుంటున్నట్టు సమాచారం.


 అధికారులే మధ్యవర్తులు
 సదరు మంత్రి దందాకు అధికారులే మధ్యవర్తులుగా ఉంటున్నారు. ఇటీవల ఆ పట్టణంలో బార్‌ నిర్వాహకులంతా సిండికేట్‌ అయ్యారు. అందులోనూ మంత్రి బేరసారాలు సాగించారు. తొలుత రూ.80 లక్షలకు బేరం కుదిరింది. అయితే ఓ బార్‌లో 50 శాతం వాటా ఇవ్వాలని మంత్రి తేల్చి చెప్పారు. దాంతో ముడుపులు కోటి రూపాయలకు చేరుకున్నాయి. అప్పుడే సిండికేట్‌ ఏర్పాటుకు అనుమతిచ్చారు. బార్‌లను పర్యవేక్షించే ఓ అధికారిని అడ్డం పెట్టుకుని బేర సారాలు సాగించారు. జిల్లాలో ఎక్కడా ప్రజాప్రతినిధులు బార్‌ల వేలం పాటలో జోక్యం చేసుకున్న సంద ర్భాలు లేవు. ఆ పట్టణంలో మాత్రం మంత్రిగారు జోక్యం చేసుకుని ఏకంగా రూ.కోటి వెనకేసుకున్నారు. ఇప్పుడు తన బంధువు భవనంలో నిర్వహిస్తున్న బార్‌ను తరలిస్తే అద్దె పోతుందన్న ఉద్దేశంతో అక్కడే ఉంచాలని దిశానిర్దేశం చేస్తున్నారు. 

Updated Date - 2022-08-09T06:08:22+05:30 IST