Advertisement
Advertisement
Abn logo
Advertisement

అస్సోం విద్యాశాఖ బృందం పర్యటన

పెదపాడు, అక్టోబరు 22: కలపర్రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను అస్సోం రాష్ట్రానికి చెందిన విద్యాశాఖ బృందం శుక్రవారం సందర్శించింది.  ఆ రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారిణి రోషిని అపరంజి నేతృత్వంలోని సభ్యులు నాడు–నేడు పనులు, విద్యార్థులకు పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలు, మధ్యా హ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఎఫ్‌ఏ–1 పరీక్షలను ఏవిధంగా నిర్వహి స్తున్నదీ పరిశీలించారు. ఏపీలో అమలవుతున్న విద్యావిధానాన్ని నిశితంగా పరి శీలించి తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు రోషినిఅపరంజి తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌సీఈ ఆర్‌టీ డైరెక్టర్‌ డాక్టర్‌ నీరదాదేవి, ఎలిమెం టరీ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ బిజోయ్‌చౌదరి, వరదాచారి, ఎంఈవో సబ్బితి నర సింహామూర్తి, హెచ్‌ఎం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement