Abn logo
Apr 12 2021 @ 23:46PM

ముగ్గురు దొంగలు అరెస్టు

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 12 : అల్లరి చిల్లరిగా తిరుగుతున్న ఇద్దరు బాలలు చెడు వ్యసనా లకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారు తెచ్చి న దొంగసొత్తును ఒక మహిళ విక్రయించి సొమ్ము చేసుకుం టూ వారిని నేరాలకు ప్రోత్సహిస్తోంది. ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌  వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం శనివారపుపేట రోడ్డులో పోలీసు లు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు బాలలు, ఒక మహిళ అను మానాస్ప దంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. లంబాడీ పేటనకు చెందినకు చెందిన 14 ఏళ్ల బాలుడు, తంగెళ్లమూడికి చెందిన 16 ఏళ్ల బాలుడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారు. వారు చోరీ చేసిన వస్తువులను లంబా డీ పేటనకు చెందిన బాలుడు పెద్దమ్మ అయిన చాందిని (39) తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుని కొంత సొమ్ము ఆ బాలలకు ఇచ్చి వారిని ప్రోత్సహి స్తోంది. ఆ ముగ్గురిని పోలీసులు విచారించగా ఇటీవల శనివారపుపేటలో, పెదవేగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు, పెదపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక దొంగతనానికి పాల్పడినట్టు అంగీకరించారు. శనివారపుపేట నకు చెందిన పలు దొంగతనాలకు సంబంధించి ఎనిమిది కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.లక్షా 65 వేలు ఉంటుందని డీఎస్పీ వివరించారు. సమావేశంలో ఏలూరు సీసీఎస్‌ డీఎస్పీ జీవీఎస్‌ పైడేశ్వరరావు, త్రీటౌన్‌ సీఐ కేవీఎస్‌వీ ప్రసాద్‌, త్రీటౌన్‌ ఎస్‌ఐలు ఎంవీ రమణ, ప్రసాద్‌, సీసీఎస్‌ ఎస్‌ఐ గంగాభవాని పాల్గొన్నారు. నేరస్తు లను అరెస్ట్‌ చేయడంలో సీసీఎస్‌ ఏఎస్‌ఐ జీవీవీఎస్‌ఎన్‌ శ్రీనివాస్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, కాని స్టేబుళ్లు రవిచంద్‌, రమేష్‌, ఓం ప్రకాష్‌ కీలక పాత్ర పోషించారని, ఎస్పీ వీరిని అభినందించారని  డీఎస్పీ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement