Abn logo
May 11 2021 @ 00:09AM

అంబులెన్స్‌ చార్జీల మోత

కొవిడ్‌ కేసులను తరలించేందుకు వేలల్లోనే

మృతదేహాల విషయంలో చెప్పుకోనక్కర్లేదు

జిల్లాలో పరుగులు తీస్తూ కాసుల వర్షం 

జంగారెడ్డిగూడెం/భీమవరం/ తాడేపల్లిగూడెం/ ఏలూరు క్రైం మే 10: కరోనా ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కరోనా వేళ అటు వైరస్‌ సోకిన వారిని లేదా మృతదేహాలను తరలించేందుకు అధిక మొత్తం గుంజుతు న్నారు. ఆసుపత్రి నుంచి మృతుడి ఇంటికి లేదా శ్మశానానికి తీసు కెళ్లాలంటే వేలల్లో డిమాండ్‌ చేస్తున్నారు. అదే ఏలూరు లేదంటే విజయవాడ ఆసుపత్రులకు బాధితులకు తీసుకువెళ్లాలంటే స్థాయిని బట్టి రూ.50 వేల వరకు అడుగుతున్నారు.

 భీమవరంలో 60 వరకు ప్రైవేటు అంబులెన్సులు ఉన్నాయి. ఈ అంబులెన్స్‌ల్లో కరోనా రోగులకు బిల్లులు వసూలు ఇష్టారాజ్యంగా ఉంది. కనీసం రూ.30 వేలు తీసుకుంటున్నారు. మృతదేహాలకు దూరాన్ని బట్టి, రోగి బంధువుల ఆస్తిపాస్తులను బట్టి 50 నుంచి 60 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వాసుపత్రి నుంచి అయితే ఒక మృతదేహానికి 5000 రూపాయలు రేటు ఫిక్స్‌ చేశారు.

 తాడేపల్లిగూడెంలో ఓ అంబులెన్స్‌ నిర్వాహకుడు చక్రం తిప్పుతున్నాడు. ఏరియా ఆసుపత్రి వద్ద అంతా తానై వ్యవహరిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించాలన్నా, మరణాలు సంభవిస్తే శ్మశాన వాటికలకు భౌతకకాయాలను చేర్చాలన్నా అతని అంబు లెన్స్‌నే ఉపయోగించేలా ఏరియా ఆసుపత్రి వద్ద చక్రం తిప్పుతున్నాడు. భౌతికకాయాన్ని తరలించాలంటే ఏకంగా రూ.25 నుంచి రూ. 35వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇతర ప్రాంతాలకు కరోనా బాధితులను తరలించాలంటే ఇప్పుడు ఆక్సిజన్‌ అవసరమవుతోంది. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ లేకుండా బాధితులను తరలించడం లేదు. తాడేపల్లిగూడెం లో ఒకే అంబులెన్స్‌కు ఆక్సిజన్‌ దక్కుతోంది. ఆ అంబులెన్స్‌ ద్వారానే ఆక్సిజన్‌ సిలెండర్‌లు ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా అవుతున్నట్టు సమాచారం. దీనివల్ల అతని మాటే చెల్లుబాటు అవుతోంది. అధిక ధరలతో బాధితుల నుంచి దోచుకుంటు న్నారు. ఇతర అంబులెన్స్‌ల ధరలు పెంచేశాయి. అంబులె న్స్‌లో కరోనా బాధితున్ని తరలించాలంటే డ్రైవర్‌ రూ.3వేలు అడుగుతున్నట్టు యజమానులు చెపుతున్నారు. ఆక్సిజన్‌ సిలెండర్‌కు రూ.1000, శానిటేషన్‌కు మరో రూ.1000 అవుతోంది. అందువల్ల ధరలు పెంచుతున్నట్టు అంబులెన్స్‌ యజమానులు తమ వాదన వినిపిస్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్లాలంటే అంబులెన్స్‌కు ఏకంగా రూ.20 వేలు చెల్లించాల్సి వస్తోంది. 


కిలోమీటరుకు రూ.2500

జూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇంటి దగ్గర నుంచి లేదా ఆసుపత్రి నుంచి స్కానింగ్‌ సెంటర్‌ వరకు అంబులెన్స్‌లో వెళ్లాలంటే కిలోమీటర్‌ పరిధిలో రూ.2500 వరకు తీసుకుంటున్నారు. ఇక ఏలూరు, విజయవాడకు రెండు రెట్లు వసూలు చేస్తున్నారు. మృతిచెందిన వారిని శ్మశానాల వద్దకు దింపేందుకు వసూలు చేసే సొమ్ము లెక్కలేదు. ‘పాజిటివ్‌ వచ్చిన వారిని తీసుకుని వెళ్లాలంటే డ్రైవర్‌ ప్రాణాలను ఫణంగా పెట్టి ధైర్యం చేయాలి. డ్రైవర్‌ గతంకంటే అధికంగా డబ్బులు అడుగుతున్నాడు. శానిటైజేషన్‌, వాటర్‌ సర్వీసింగ్‌ చేయాలంటే రూ.1200 వసూలు చేస్తున్నారు. మాక్కూడా డబుల్‌ ఖర్చు అవుతోందని చెప్పుకొచ్చాడు’ ఓ యజమాని.  ఇదిలా ఉండగా పట్టణంలో ఒక వ్యక్తి మూడు అంబులెన్స్‌లు నిర్వహిస్తున్నాడు. ఈ మూడు అంబులెన్స్‌ డ్రైవర్‌లకు పాజిటివ్‌ రావడంతో ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టు చెబుతున్నారు. 


అంబులెన్స్‌ సేవల ధరలు ఫిక్స్‌

నియంత్రణకు కలెక్టర్‌ మిశ్రా చర్యలు 

అధికంగా వసూలు చేస్తే చర్యలు

ఏలూరు క్రైం, మే 10: జిల్లాలో అంబులెన్స్‌ సేవల ధరల నియంత్రణకు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా చర్యలు చేపట్టారు. రవాణాశాఖ, పోలీసు అధికారులతో మాట్లాడి ధరలను నిర్ధా రించి అమలుకు సిద్ధమయ్యారు. అక్రమ వసూళ్లకు పాల్ప డితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొవిడ్‌ మృత దేహాలను ఆసుపత్రి మార్చురీ నుంచి మృతుని ఇల్లు లేదా శ్మశాన వాటికకు చేరవేయడం, అత్యవసర పరిస్థితుల్లో కరోనా రోగుల తరలింపు, నాన్‌కొవిడ్‌ మృతదేహాల తరలిం పులకు ధరలను నిర్ణయించారు. దూర ప్రాంతాలకు వెళితే రెండో డ్రైవర్‌ బేటా, వెయిటింగ్‌ ఛార్జీలను సైతం అధికా రులు నిర్ణయించారు. వెంటిలేటర్‌ టెక్నీషియన్‌, ఆక్సిజన్‌ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. 110 కిలో మీటర్ల దూరానికి ప్రతి కిలోమీటరుకు 20 రూపాయలు చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. 110 కిలో మీటర్ల పైబడి అదనపు  డ్రైవర్‌కు బేటాగా 500 రూపాయ లు చెల్లించాలని పేర్కొన్నారు. రెండు గంటలకంటే తక్కువ అయితే వెయిటింగ్‌ ఛార్జీలు ఉండవని చెప్పారు. రెండు గంటలకు పైబడి వెయిటింగ్‌ ఉంటే ప్రతి గంటకు రూ.500 అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రైవేటు అంబులెన్సు డ్రైవర్లు ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు, ప్రభుత్వానికి సహ కరించాలని నిర్ణయించిన ధరలు ప్రకారమే తీసుకోవాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అదనంగా ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే కొవిడ్‌ కంట్రోల్‌ సెల్‌ నెంబర్‌ 99897 57569 లేదా 99086 64342కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  


మృతదేహాల తరలింపునకు అంబులెన్స్‌ సేవలకు నిర్ధేశించిన ధరలు  : (మారుతీ ఓమ్నీ /ఈకో టెంపో /తుఫాన్‌)  

కి.మీ. నాన్‌కొవిడ్‌   కొవిడ్‌ 


0–10 1700    2800

0–10         1700    2800

11–20 2200     3300

11–20 2400     3500

21–30 2400    3500

21–30 2700     3800

31–40 2600     3700

31–40 2970     4070

41–50 2860     3960

41–50 3190    4290

51–60 3080    4180

51–60 3410     4510

61–70 3300     4400

61–70 3630     4730

71–80 3520     4620

71–80 3850    4950

81–90 3740     4840

81–90 4070     5170

91–100 3960     5060

91–100 4290    5390

101–110 4620     5720

101–110  5060  6160


సమీక్షిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా


Advertisement
Advertisement
Advertisement