అల్లూరి నామస్మరణ

ABN , First Publish Date - 2022-07-04T06:02:05+05:30 IST

పార్టీలకతీతంగా అంతా ఏకమయ్యారు.

అల్లూరి నామస్మరణ
అల్లూరి విగ్రహం వద్ద పూల అలంకరణ

నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాక
సీఎం, గవర్నర్‌, చిరంజీవి తదితరుల హాజరు
మన్యం వీరుడికి నిలువెత్తు నమోస్తుతి
ప్రధాని రాక కోసం భీమవరం.. సర్వం సిద్ధం
పట్టణంలో అపూర్వ స్వాగతాలు ఏర్పాటు
ఒకే వేదికపై భిన్న స్వరాలు
కుటుంబీకులకు, సమరవీరులకు సత్కారం
ఉప్పొంగిన అల్లూరి అభిమానులు
పనుల పర్యవేక్షణలోనూ ఏకత్వం
బంధుమిత్రులతో పట్టణం కళ కళ
జనసమీకరణకు వెయ్యి బస్సులు
మూడు వేల మంది భద్రతా సిబ్బంది  
60 వేల మంది జనం హాజరవుతారని అంచనా
ఉత్సవ కేంద్రంలో మూడు వేదికలు



మన్యం వీరుడు అల్లూరి పేరు ఎత్తితేనే ఇక్కడి వారి ఒళ్లంత పులకరింత.. మనస్సు నిండా ఉద్వేగం. అంతకుమించి ఉత్కంఠ. అల్లూరి పేరుతో మమేకమైన ఇక్కడి ప్రజలంతా సాక్షాత్తు ఆయన నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం, ఈ కార్యక్ర మానికి ప్రధాని మోదీ కదలిరావడం అందరినీ ఉత్తేజపరిచింది. ఇప్పుడు అన్నిచోట్ల సీతారామ రాజు నామస్మరణే. ఆయన పూర్వీకులు వచ్చినా, కనపడినా వారితో ఫొటోలు దిగేందుకు  ఆసక్తి చూపడంతోపాటు ఆయన పూర్వ గాథలను వినేందుకు ఉత్సుకత చూపుతున్నారు.



(ఏలూరు/భీమవరం, ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
పార్టీలకతీతంగా అంతా ఏకమయ్యారు. గంటల తరబడి నిలబడి ఏర్పాట్ల పర్య వేక్షించారు. తా మంతా ఆరాధించే విప్లవ వీరుడు అల్లూరి విగ్రహా విష్కరణకు పనులు పరుగులెత్తించారు. ఓ వైపు వర్షం వెన్నాడుతున్నా, ఇంకోవైపు చిన్నాచితక సమ స్యలు తలెత్తినా కార్యక్రమం విజయవంతానికి నిద్రహారాలు మాని కష్టించారు. భీమవరంలో సోమవారం అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం జగన్మోహన్‌రెడ్డి హాజరవుతు న్నారు. దీనికి తగ్గట్టుగానే నిఘా నీడన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేలాది మంది రాకకు భీమ వరం సంసిద్ధమైంది. అల్లూరి 125 జయంతి వేడుకలకు జాతీయ స్ఫూర్తితో భీమవరం పులకిస్తోంది. అతిఽథులతో కళకళలాడుతోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు నామస్మరణ చేస్తున్నారు.

అల్లూరి వారసులతో ఆత్మీయ భేటీ
సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతం లో అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెద అమిరంలోని సభా వేదిక నుంచి ప్రధాని వర్చు వల్‌ విధానంలో ఆవిష్కరించనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అల్లూరి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఆయన సోదరుడి కుమారుడు శ్రీరామరాజును, మన్యం పోరాటంలో అండగా నిలి చిన మల్లు దొర కుమారుడు బోడి దొరను ప్రధాని స్వయంగా సత్కరించబోతున్నారు. ఇప్పటికే అల్లూ రి కుటుంబ సంతతి, వారసులు, సహచరుల వార సులను ప్రభుత్వం గుర్తించి  మూడు రోజుల క్రిత మే భీమవరానికి రప్పించింది. అల్లూరి పేరు చిర స్థాయిగా ఉండేలా భీమవరం గడ్డకు శోభ తెచ్చే లా వీరితో ప్రధాని భేటీ కాబోతున్నారు. భీమవరా నికి అత్యంత సమీపాన ఉన్న మోగల్లులో ఇప్పుడు ఎవరిని కదిపినా అల్లూరి స్మరణే. దీనికి తగ్గట్టు ఆ గ్రామం నుంచి పెద్ద ఎత్తున భీమవరానికి తరలి వచ్చేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

జాతీయస్థాయి గుర్తింపు

అల్లూరి జయంతి వేడుకలకు ప్రధాని హాజరు కానుండడంతో భీమవరం జాతీయ దృష్టిని ఆకర్షించింది. బ్రిటీష్‌ పాలకులను గడగడలాడించిన విప్ల వ వీరుడు అల్లూరి జయంతి వేడుకలకు ప్రధాని హాజరు కావడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి భీమవరం పట్టణం ఎందరో ప్రధానులను చూసిం ది. ఈ గడ్డపై గతంలోనూ దేశ ప్రధానులు అడు గుపెట్టారు. ఎన్నికల ప్రచారానికి ప్రధాని హోదా లోనే ఇందిరాగాంధీ భీమవరం విచ్చేశారు. దేశ ప్రధానిగా పీవీ నరసింహరావు పట్టణానికి వచ్చా రు. ఇప్పుడు ప్రధాని హోదాలో మోదీ వస్తున్నారు.   అల్లూరి జయంతి ఉత్సవాలకు ప్రముఖులు విచ్చేస్తున్నారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి గవర్నర్‌ విశ్వభూషణ హరిచందన్‌, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ రఘురామకృష్ణంరాజు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కేం ద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా హాజరవు తున్నారు. ఆదివారం రాత్రికే అచ్చెన్నాయుడు భీమవరం చేరుకున్నారు. క్షత్రియ సేవ సమితి తరపున సైతం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లోని ప్రముఖులకు ఆహ్వా నాలు వెళ్లాయి. ఆహ్వానం అందుకున్న వారందరూ ఇప్పటికే భీమవరం చేరుకున్నారు.

అన్ని దారులు భీమవరం వైపే..
దేశం నలుమూలల నుంచి అల్లూరిని ఆరా ధించే వారంతా భీమవరం బాట పట్టారు. బెంగ ళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాదు, ఒడిశా, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి అనేక మంది తరలి వస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వందల మంది తమకు తెలిసిన వారి ఇళ్ల ల్లో బస చేశారు. మరికొందరు ప్రైవేటు అతిఽథి గృ హాలు, హోటళ్లలో దిగారు. మూడు రోజుల క్రితమే భీమవరంలోని హోటళ్లన్నీ భర్తీ అయ్యాయి. అల్లూరి మీద అభిమానం ఉన్న వారంతా స్పందిం చి వారికి వసతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అల్లూరి క్షత్రియ సేవా పరిషత్‌ ఈ విషయంలో ముందు వరుసలో నిలిచింది. దీనికితోడు అల్లూరి సాంస్కృతిక కేంద్రం ఎక్కడికక్కడ సమన్వయ పర్చుకుని కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షి స్తూ వచ్చింది. కేంద్రం చొరవ తీసుకుని రూ.30 కోట్ల వ్యయం తో ఈ ప్రాజెక్టును ఆరంభించగా, కులా లు, మతాలు, రాజకీ యాలకు అతీతంగా ఎక్కడికక్కడ స్వచ్ఛం దంగా తమంతట తా ముగానే కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

పండుగ వాతావరణం
అల్లూరి జయంత్యుత్సవాలతో భీమవరం పట్ట ణం అంతా పండుగ వాతావరణాన్ని తలపిస్తోం ది. ప్రధాన దారులన్నీ అల్లూరి సీతారామరాజు, ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లెక్సీలతో అలంకరించారు. జువ్వలపాలెం రహదారి మార్గాన్ని విద్యుత్‌ దీపా లతో ముస్తాబుచేశారు. ఆల్లూరి కాంస్య విగ్రహం వద్ద విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేసి సర్వాంగ సుం దరంగా తీర్చిదిద్దారు. కాం స్య విగ్రహం వద్దే ఏర్పాటు చేసిన 100 అడుగుల ఫ్లెక్సీ ప్రత్యేక ఆక ర్షణగా నిలిచింది. బీజేపీ శ్రేణులు సైతం ఫ్లెక్సీల ఏర్పాటుకు పోటీ పడ్డారు. విద్యా సంస్థలు అల్లూరి ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి ప్రధా నికి స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అల్లూ రి జయంతి సందర్భంగా సోమవారం వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.  

మూడు నెలలుగా ఏర్పాట్లు
గత మూడు నెలలుగా జిల్లా యంత్రాంగం, క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు జయంతి ఉత్సవాల ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. ప్రధాని సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున ప్రజలను జయంత్యు త్సవాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. సభకు హాజరయ్యే ప్రతీ ఒక్కరికి గుర్తింపు కార్డులు మంజూ రు చేస్తున్నారు. గడిచిన వారం రోజుల నుంచి భీమవరంలో యువత, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు ఉత్సవాల్లో భాగస్వాముల య్యాయి. ర్యాలీలు సాంస్కృతిక ప్రదర్శనలు, కళారూపాలతో పట్టణాన్ని హోరెత్తించారు.  

వర్చువల్‌లో విగ్రహావిష్కరణ
భీమవరం, జూలై 3 : అలూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ఆవిష్కరించనున్నారు. పెద అమిరంలోని బహిరంగ సభకు పట్టణంలోని సీతారామరాజు విగ్రహానికి నాలుగు కిలోమీటర్లు దూరం. తొలుత ప్రతిపాదించిన ప్రకారం హెలికాప్టర్‌ మీదుగా దిగిన తరువాత ప్రధాని విగ్రహం వద్దకు వచ్చి ఆవిష్కరించాలి. తదుపరి బహిరంగ సభకు వెళ్లాలి. భద్రతా కారణా లు, వాతావరణం తదితర అంశాల ప్రాతిపదిక న సభా వేదికపై నుంచే విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కార్యాచరణ రూపొందించారు.  

రెండోసారి మోదీ రాక
ప్రధాని మోదీ భీమవరానికి రెండోసారి విచ్చేస్తున్నారు. 2014 ఎన్నికల ముందు ఎన్‌ డీఏ తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రచారానికి భీమవరం విచ్చేశారు. ఆయనతోపాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  విచ్చేశారు. అటువంటి వాతావరణ మే ఇప్పుడూ కనిపిస్తోంది. ప్రధాని హోదాలో మోదీ వస్తున్నారు.

అల్లూరి విగ్రహం వివరాలు
ఎత్తు : 30 అడుగులు
బరువు :  17 టన్నులకు పైగా
మెటీరియల్‌ : పది టన్నుల కాంస్యం, ఏడు టన్నుల స్టీలు
తయారీ ఖర్చు : మూడు కోట్లు
చేసిన సమయం : 32 రోజులు
పార్కు అభివృద్ధికి రూ.2 కోట్లు


మోదీ టూర్‌ షెడ్యూలు
ఉదయం
9.25 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో పయనం..
10.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు రాక
10.15 గంటలకు హెలికాప్టర్‌లో భీమవరం పయనం
10.50 గంటలకు భీమవరం హెలీప్యాడ్‌కు రాక
10.55 గంటలకు రోడ్డు ద్వారా సభా వేదికకు పయనం
11.00 గంటలకు సభా వేదికకు రాక
11.12 గంటలకు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ
11.15 గంటలకు సభలో ప్రసంగం
మధ్యాహ్నం
12.25 సభ నుంచి హెలీప్యాడ్‌కు పయనం
12.30 గంటలకు విజయవాడకు ఎయిర్‌పోర్ట్‌కు పయనం
1.10 గంటలకు నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ పయనం.

నిఘా నీడలో..
భీమవరం క్రైం, జూలై 3 : ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భీమవరం పట్టణమంతా పోలీసు బలగాలు చుట్టు          ముట్టాయి. సభా వేదిక, హెలిప్యాడ్‌లను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరైనా పాస్‌ చూపిస్తేనే లోపలికి అనుమతిస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు రెండు రోజులుగా ఆ ప్రాంతంలో నిఘా వేశారు. సీతారామరాజు విగ్రహం, సభావేదిక, హెలిప్యాడ్‌ల ప్రాంతాలలో కాపుకాసి బయటి వారిని రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిపై నిఘా పెంచారు. ముందుగానే డ్రోన్‌ కెమెరాలతో ట్రైల్‌ రన్‌ వేశారు. హెలిప్యాడ్‌ నుండి సభా వేదిక వద్దకు సమయం ఎంత పడుతుందో ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు. వాహనాలను జువ్వలపాలెం రోడ్డు నుంచి ఉండి రోడ్డులోకి మళ్లించారు. పెద  అమిరం పుంత వద్ద జువ్వలపాలెం రోడ్డులో ఒక చెక్‌ పోస్టు, హెలిప్యాడ్‌ల సమీపంలో ఒక చెక్‌ పోస్టు ఏర్పాటు చేశారు. లోపలికి వచ్చే వారిని తనిఖీ చేసి పంపిస్తున్నారు.

మద్యం షాపులు బంద్‌
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సోమవారం రెండో పట్టణంలోని అన్ని మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించినట్లు ఎక్సైజ్‌ సీఐ బలరామరాజు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసివేయనున్నట్లు తెలిపారు.

బస్సులన్నీ ఉండి రోడ్డు నుండే..
సభకు హజరయ్యే వాహనాలన్నింటిని ఉండి రోడ్డు మీదుగా హుండాయ్‌ కార్ల షోరూం వద్ద నుంచి పెద అమిరం పుంత రోడ్డులోకి మళ్లించారు. ఆ రోడ్డులోని ఖాళీ లే అవుట్‌ల్లో ఏడు ప్రదేశాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. జువ్వలపాలెం రోడ్డును పూర్తిగా మూసివేస్తారు. వీఐపీ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. వెస్ట్‌ బెర్రి స్కూల్‌ ఆవరణలో 34 బస్సులు, రాధాకృష్ణ కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద 102 బస్సులు, ప్లోరింజా లే అవుట్‌లో 141 బస్సులు, హైదరాబాద్‌ డీటీసీపీ లే అవుట్‌లో 117 బస్సులు, డాక్టర్‌ గారి సైట్‌లో 200 బస్సులు, ఎస్‌ఆర్‌కేఆర్‌ కాలేజీ ప్లేగ్రౌండ్‌లో 200 బస్సులు, కేబుల్‌ శ్రీను లేఅవుట్‌లో 206  బస్సులుకు పార్కింగ్‌ చేయనున్నారు.



Updated Date - 2022-07-04T06:02:05+05:30 IST