తాత గారి పోరాటాలు గర్వకారణం

ABN , First Publish Date - 2022-07-03T06:50:24+05:30 IST

‘ఆ రోజుల్లో బ్రిటిష్‌ వారి దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ గిరిజనుల తరపున మా పెద్ద తాతయ్య అల్లూరి సీతారామరాజు గారు చేసిన పోరాటాలు, మాకు స్ఫూర్తిదాయ కం. గర్వకారణం’ అని మన్యం వీరుడు సీతారామరాజు వారసుడు, సోదరుడు సత్యనారాయణరాజు మనవడు అల్లూరి శ్రీరామరాజు పేర్కొన్నారు.

తాత గారి పోరాటాలు గర్వకారణం
అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న అల్లూరి శ్రీరామరాజు

‘ఆంధ్రజ్యోతి’తో అల్లూరి సోదరుడు  సత్యనారాయణరాజు మనవడు శ్రీరామరాజు


భీమవరం, జూలై 2 : ‘ఆ రోజుల్లో బ్రిటిష్‌ వారి దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ గిరిజనుల తరపున మా పెద్ద తాతయ్య అల్లూరి సీతారామరాజు గారు చేసిన పోరాటాలు, మాకు స్ఫూర్తిదాయ కం. గర్వకారణం’ అని మన్యం వీరుడు సీతారామరాజు వారసుడు, సోదరుడు సత్యనారాయణరాజు మనవడు అల్లూరి శ్రీరామరాజు పేర్కొన్నారు. విజయనగరంలో ఉంటున్న శ్రీరామరాజు సీతారామరాజు జయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు భీమవరం వచ్చారు. శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
తాత గారి పేరు శ్రీరామరాజు. వివాహం చేసుకోలేదు.. ఆయన అప్పట్లో పొరపాటుగా సీత అని ముందు జత చేశారు. దీంతో కొందరు ఆయన సీత అనే మహిళను ప్రేమించారని చెబుతారు ఇది నిజం కాదు..
తాతగారు ఆధ్యాత్మిక జ్ఞాని.. యోగ విద్యలో ప్రావీణ్యం ఉంది.. కాళికాదేవి భక్తుడు.. అందుకే ఒకేసారి మూడు ప్రాంతాల్లో కనిపించేవారని చెబుతారు.
గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం గురించి చదివినప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో స్ఫూర్తి పొందేవాడిని. ఆయన చరిత్రను బంధువుల ద్వారా తెలుసుకున్నా.
అల్లూరి సీతారామరాజు సినిమా తీసినప్పుడు తాతగారు గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే తెలిసింది. ఇప్పుడు భీమవరం విగ్రహావిష్కరణ ఏర్పాట్లుతో దేశ ప్రజలందరికీ ప్రపంచానికి తెలుస్తుంది.
బ్రిటిష్‌ వారికి ప్రాణాలు ఎదురొడ్డి సీతారామరాజు చేసిన పోరాటం గురించి చదివినప్పుడల్లా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. చాలా గర్వంగా ఉంటుంది.

Updated Date - 2022-07-03T06:50:24+05:30 IST