స్వాతంత్య్ర స్ఫూర్తిని భావితరాలకు అందించాలి

ABN , First Publish Date - 2021-09-18T05:30:00+05:30 IST

స్వాతంత్య్ర స్పూర్తిని భావితరాలకు అందిం చాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు.

స్వాతంత్య్ర స్ఫూర్తిని భావితరాలకు అందించాలి
2కే ఫ్రీడమ్‌ రన్‌లో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తదితరులు

కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా.. ఉత్సాహంగా 2కే ఫ్రీడమ్‌ రన్‌

ఏలూరు స్పోర్ట్స్‌, సెప్టెంబరు 18: స్వాతంత్య్ర స్పూర్తిని భావితరాలకు అందిం చాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు  అయిన నేపథ్యంలో తరుణంలో దేశవ్యాప్తంగా ఆజాదీకీ అమృత్‌ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో శనివారం 2కే ఫ్రీడమ్‌ రన్‌ ఉత్సాహంగా జరిగింది. ఇండోర్‌ స్టేడియం వద్ద ఈ రన్‌ను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి ఆయన ఫ్రీడమ్‌ రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర స్ఫూర్తిని పునఃశ్ఛరణ చేసుకుని దేశ ప్రజలు పునరంకితం అయ్యేం దుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్‌ మిషన్‌ జిల్లా శాఖ రూపొందించిన స్వచ్ఛతాకీ సేవ పోస్టర్‌ను ఆయన ఆవిష్క రించారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం యూత్‌ అధికారం దూలం కిషోర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.రవి, రాఘవులు, డీపీవో రమేష్‌, డీఈవో సీవీ రేణుక, ఎన్‌సీసీ కేడెట్స్‌, వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రతి నిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  

Updated Date - 2021-09-18T05:30:00+05:30 IST