17 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-07-26T06:12:04+05:30 IST

కరోనా కేసులు నాలుగు మండలాల్లో ఆదివారం 17 నమోదయ్యాయి.

17 కరోనా కేసులు నమోదు
మల్కాపురంలో బ్లీచింగ్‌ చల్లుతున్న దృశ్యం

ఏలూరు రూరల్‌/ దెందులూరు/పెదవేగి/పెదపాడు, జూలై 25 : కరోనా కేసులు నాలుగు మండలాల్లో ఆదివారం 17 నమోదయ్యాయి. ఏలూరు మండ లంలో ఆదివారం మూడు కేసులు నమోదయ్యాయని ఇన్‌ఛార్జి ఎంపీడీవో సరళ కుమారి తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. దెందులూరు మండలంలోని రామారావుగూడెంలో 2, మేదినరావు పాలెం, గోపన్నపాలెం,  గాలాయగూడెంలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు  పాజిటివ్‌ కేసులు నమోదయినట్టు తహసీల్దార్‌ నాంచారయ్య, ఎంపీడీవో లక్ష్మి తెలిపారు. పెదవేగి మండలంలో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యా యని పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ టీవీఎల్‌.ప్రసన్నకుమార్‌ చెప్పారు. ఇప్పటివరకు మండలంలో 1526 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వారిలో హోమ్‌ ఐసొలేషన్‌లో 1335 మంది ఉండి, చికిత్స పూర్తిచేసుకున్నారని ఆయన తెలిపారు. 57 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని, 100 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ మరణాలు 34 కాగా అందులో ఆరుగురు ఇంటిదగ్గర మృతి చెందగా, 28 మంది ఆస్పత్రిలో మృతి చెందారని డాక్టర్‌ ప్రసన్నకుమార్‌ చెప్పారు. పెదపాడు మండలం పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో గుడిపాడు, పాతముప్పర్రు గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు.  

Updated Date - 2021-07-26T06:12:04+05:30 IST