బడిలో మోగిన ఎన్నికల గంట

ABN , First Publish Date - 2021-09-17T05:13:52+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల గంట మో గింది.

బడిలో మోగిన ఎన్నికల గంట
గోపన్నపాలెంలో నోటిఫికేషన్‌, ఓటర్ల జాబితా ప్రదర్శిస్తున్న ఉపాధ్యాయులు

తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీల ఎంపికకు నోటిఫికేషన్‌ 

ఏలూరు రూరల్‌, సెప్టెంబరు 16: ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల గంట మో గింది. తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీల ఎంపికకు గురువారం మండలంలోని అన్ని పాఠ శాలల్లో నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈనెల 22న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లతో పాటు కమిటీ సభ్యుల ఎన్నిక జరుగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మండలంలో 48 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.పాఠశాల కమిటీలో ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాలి. ప్రాథమిక పాఠశాలలో 15 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో 24 మంది, ఉన్నత పాఠశాలలో 9 మందిని ఎన్నుకుంటారు. హెచ్‌ఎం కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో ఆరుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులను నియమించుకునే అవకాశం ఉంది. పాఠశాల హెచ్‌ఎం, పంచా యతీ వార్డు సభ్యుడు, అంగన్‌వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలికి అవకాశం ఇస్తారు. విద్యార్థి తల్లిదండ్రుల్లో ఒక్కరికి మాత్రమే ఓటుహక్కు ఉంటుంది. ఇద్దరు పిల్లలు వేర్వేరు పాఠశాలల్లో చదివితే రెండు చోట్ల ఒకరికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. 

 నాడు – నేడుతో పెరిగిన ప్రాధాన్యం 

పాఠశాలలో నాడు– నేడు పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఉండ డంతో తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో రాజ కీయ నాయకులు తెర వెనుక ఉండి తమ అనుచరులకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కేలా పావులు కదుపుతున్నారు. సజావుగా ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన పథకం అమలు పాఠశాల నిర్వహణ నిధులు ఖర్చు, విద్యా కానుకల పంపిణీ వ్యవహారాల్లో కూడా పేరెంట్స్‌ కమిటీలు కీలకపాత్ర పోషించనున్నాయి.  

దెందులూరు : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీల ఎన్నికలు నిర్వహిం చేందుకు నోటిఫికేషన్‌ సంబంధిత పాఠశాల హెచ్‌ఎంలు విడుదల చేశా రని మండల విద్యాశాఖాధికారి సీహెచ్‌ బుధవ్యాస్‌ తెలిపారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ 22వ తేదీన విద్యా  కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. ఏ పాఠశాలకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షతన జరుగుతా యన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో విడుదల చేసిన ఓటర్ల లిస్టు, నోటిఫికేషన్‌లను పరిశీలించారు.

పెదపాడు : ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్టు మండల విద్యాశాఖా ధికారి సబ్బితి నరసింహ మూర్తి తెలిపారు. పెదపాడు హైస్కూల్‌, పలు పాఠ శాలలను సందర్శించి ఉపాధ్యాయులకు సూచనలు అందజేశారు. అనంతరం ఎంఈవో మాట్లాడుతూ నోటిఫికేషన్లను, తల్లిదండ్రుల కమిటీ ఓటర్ల జాబి తాలను ఆయా పాఠశాలల్లోని నోటీస్‌బోర్డులో ఉంచారన్నారు.  

Updated Date - 2021-09-17T05:13:52+05:30 IST