అర్హులైనా అందని పింఛను

ABN , First Publish Date - 2021-10-19T05:06:45+05:30 IST

మండలంలోని తంగెళ్లమూడికి చెందిన 25 మంది వృద్ధులకు పిం ఛన్లు నిలిచిపోయాయి.

అర్హులైనా అందని పింఛను

 తంగెళ్లమూడిలో 25 మందికి రెండు నెలలుగా నిలిచిపోయిన పెన్షన్లు 

ఏలూరు రూరల్‌, అక్టోబరు 18 : మండలంలోని తంగెళ్లమూడికి చెందిన 25 మంది వృద్ధులకు పిం ఛన్లు నిలిచిపోయాయి. వీరిలో 70 ఏళ్లు దాటిన వారు చాలామంది ఉన్నారు. రూ.75 పింఛన్‌ కాలం నాటి నుంచి పింఛను అందుకుంటు న్నారు. ఇప్పుడేమో వేలి ముద్రలు పడలేదని, వయస్సు తేడా ఉందని, కరెంటు బిల్లు ఎక్కువ వాడుతున్నారని నెపం చూపి పింఛను నిలిపివేశారని వారు గగ్గోలు పెడుతున్నారు.  తంగెళ్లమూడి బీడీ కాలనీకి చెందిన కొత్తపల్లి ప్రసాద్‌ వృద్ధాప్య పింఛను పొందుతున్నాడు. కొప్పర్తి గౌరమ్మ దివ్యాంగ పెన్షను, వీరా అన్నపూర్ణ, వి.పూర్ణచంద్రరావు, ఆడారి పెంటయ్య తదితరులు వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. అయితే రెండు నెలల నుంచి వీరంద రికీ సొంత ఇల్లు, కారు, బంగ్లా, వయస్సు తేడా, అధిక కరెంటు బిల్లులు కార ణంగా చూపి పింఛన్లు నిలిపివేశారు. దీంతో వారు లబోదిబోమంటూ అధి కారుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. తమ పింఛన్లను పునరుద్ధరిం చాలంటూ కోరుతున్నారు.  

Updated Date - 2021-10-19T05:06:45+05:30 IST