శనివారపుపేటలో మరో రెండు డెంగీ కేసులు

ABN , First Publish Date - 2021-10-26T05:14:23+05:30 IST

ఓవైపు కరోనాతో ప్రజలు భయపడుతుంటే, మరో వైపు సీజన్‌ వ్యాధులు ప్రజలపై దాడి చేస్తున్నాయి.

శనివారపుపేటలో  మరో రెండు డెంగీ కేసులు
డెంగీ ప్రబలిన ప్రాంతంలో బ్లీచింగ్‌

ఏలూరు కలెక్టరేట్‌, అక్టోబరు 25: ఓవైపు కరోనాతో ప్రజలు భయపడుతుంటే, మరో వైపు సీజన్‌ వ్యాధులు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఏలూరు మండ లంలో  డెంగీ కలకలం రేపు తోంది. శనివారపుపేటలో ఇప్పటికే ఐదుగురు డెంగీ  బారిన పడి కోలుకోగా తాజాగా గ్రామంలో మరో రెండు కేసు లు వెలుగు చూశాయి. వారు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స  పొందుతు న్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో సంఖ్య రెట్టింపుగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లో జ్వరంతో బాధపడుతు న్న ప్రతి ఒక్కరికి ఎలీషా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పదుల సం ఖ్యలో డెంగీ కేసులు వస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదన్న విమ ర్శలు వస్తున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎవరికి వారు ఇళ్లల్లో నీరు నిల్వ ఉండకుండా, పాత టైర్లు కాని కుండలు కాని ఉంటే తీసి వేయాలని ఎంపీహెచ్‌వో సూచించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ముఖ్యంగా దోమలు రాకుండా చూసుకోవాలన్నారు. దోమకాటుకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 

Updated Date - 2021-10-26T05:14:23+05:30 IST