పోరాట యోధుడు అల్లూరి

ABN , First Publish Date - 2022-06-30T05:40:53+05:30 IST

స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని, ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పుణికి పుచ్చుకోవాలని డీఈవో ఆర్‌.వెంకటరమణ అన్నారు.

పోరాట యోధుడు అల్లూరి
సైకిల్‌ ర్యాలీలో డీఈవో వెంకటరమణ, తదితరులు

డీఈవో వెంకటరమణ
జాతీయ పట్ఛకాలతో సైకిల్‌ ర్యాలీ

భీమవరం ఎడ్యుకేషన్‌, జూన్‌ 29 : స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని, ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పుణికి పుచ్చుకోవాలని  డీఈవో ఆర్‌.వెంకటరమణ అన్నారు. అల్లూరి 125వ జయంత్యుత్సవా లను పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ, జిల్లా క్రీడాభివృద్ధి సంస్ధ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జాతీయ పతాకాలతో సైకిల్‌ ర్యాలీని నిర్వహించారు. ప్రకాశం చౌక్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డు మీదుగా డీఎన్నార్‌ కళాశాల క్రీడామైదానం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ మన్యం ప్రజల హక్కుల కోసం స్వాతంత్య్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయస్సులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ, అడిషనల్‌ ఎస్పీ ఏవీ సుబ్బరాజు, జిల్లా యువజన అధికారి వి.కిషోర్‌, జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ అధికారి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. కాగా  పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - 2022-06-30T05:40:53+05:30 IST