Abn logo
Sep 21 2021 @ 00:03AM

ఏపీ నిట్‌కు విద్యార్థుల రాక

కళాశాలకు చేరుకుంటున్న విద్యార్థులు

తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీ నిట్‌)లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ తరగతులు మొదలయ్యాయి. రెండు రోజుల నుంచి విద్యార్థులు క్యాంపస్‌కు వస్తున్నారు.వీరందరికీ రెండు వారాలపాటు తమకు కేటాయించిన హాస్టల్స్‌ గదుల్లోనే క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అక్టోబరు నాలుగో తేదీ నుంచి రెగ్యులర్‌ తరగతులు నిర్వహిస్తారు. అప్పటి వరకు హాస్టళ్లలోనే ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావాలి. హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భోజనాలు సమకూరుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి మేరకు ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్టు నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు తెలిపారు.క్యాంపస్‌కు చేరుకున్న విద్యార్థులకు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తదుపరి మూడో సంవత్సరం విద్యార్థులకు తరగ తులు ప్రారంభించనున్నట్టు నిట్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 529 మందికిగాను సోమవారం సాయంత్రానికి 340 మంది రిపోర్ట్‌ చేశారని తెలిపారు.