ఒక్కరోజే గడువు!

ABN , First Publish Date - 2022-09-07T06:10:50+05:30 IST

బయోమెట్రిక్‌ ద్వారా పీఎంకేఎస్‌వైలో వారిని నమోదు చేయాలంటే కష్టతర మవుతోంది.

ఒక్కరోజే గడువు!

 పీఎంకేఎస్‌వైలో నమోదుకు వ్యవసాయ శాఖ తంటాలు
ఈసారి బయోమెట్రిక్‌ విధానం అమలు
జిల్లాలో 18వేల మంది రైతులు పెండింగ్‌
బయోమెట్రిక్‌ నమోదు కాకున్నా అనర్హత జాబితాలో పెట్టొద్దు
ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు


భీమవరం రెవెన్యూ డివిజన్‌లో రామయ్య అనే రైతుకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన (పీఎంకే ఎస్‌వై)లో ఏటా రూ.6 వేలు మంజూరవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7,500 చెల్లిస్తోంది. మొత్తం రైతు భరోసా రూపంలో రూ.13,500 ముడుతున్నాయి. ఈసారి ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బయోమెట్రిక్‌ ద్వారా రైతుల పేర్లు నమోదు చేయాలని దిశా నిర్దేశం చేసింది. అందుకోసం వ్యవసాయ శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు.


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 76 వేల మందిని పీఎంకేఎస్‌వైలో నమోదు చేశారు. రామయ్య లాంటి ఎందరో రైతులు ఇప్పుడు గ్రామాల్లో తారసపడడం లేదు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. బయోమెట్రిక్‌ ద్వారా పీఎంకేఎస్‌వైలో వారిని నమోదు చేయాలంటే కష్టతర మవుతోంది. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామస్థాయిలో జల్లెడ పడుతున్నారు. గతంలో బయో మెట్రిక్‌ విధానం అమలులో లేదు. ప్రజా సాఽధికార సర్వేను ప్రామాణికంగా తీసుకున్నారు. ఫలితంగా జిల్లాలో దాదాపు 94 వేల మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన్‌లో లబ్ధి చేకూరుతూ వస్తోంది. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచే రూ.12 వేలు జమ చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. చివ రకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ములతో కలిపి అమలు చేస్తున్నారు. అర్హులకు మాత్రమే ఇప్పుడు పథకాన్ని వర్తిం పజేయాలన్న ఉద్దేశంతో బయోమెట్రిక్‌ నమో దు ప్రక్రియను చేపడుతున్నారు. దీని వల్ల బయట ప్రాంతాల్లో ఉన్న వారికి నమోదు చేసే అవకాశం లేకుండా పోతోంది. వాస్తవా నికి పీఎంకేఎస్‌వై నమోదులో పశ్చిమ ప్రథమ స్థానంలో ఉంది. అయినా జిల్లాలో మరో 18 వేల మంది రైతుల బయోమెట్రిక్‌ నమోదు చేయాల్సి ఉంది.

 ఓసీ కౌలు రైతులకు దూరం..
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనలో భాగంగా
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులకు మాత్రమే సొమ్ములు చెల్లిస్తున్నారు. భూమి ఉన్న రైతులకు సంబంధించి అన్ని కేటగిరీల రైతులకు చెల్లించే రైతు భరోసాను కౌలు రైతుల విషయంలో వివక్ష చూపుతున్నారు. ఓసీ కేటగిరీ కింద వచ్చే కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేయడం లేదు.  ఇప్పుడు బయోమెట్రిక్‌ విధానం అమలు కారణంగా అసలు రైతులు దూర మయ్యే పరిస్థితి కనిపిస్తోంది.  

అనర్హత కానట్టే..
నిజానికి బయోమెట్రిక్‌ ద్వారా నమోదు కాని రైతు లకు అనర్హుల జాబితాలో పెట్టాలి. ప్రస్తుతం అటువంటి చర్యలు తీసుకోవద్దంటూ జిల్లా వ్యవసాయ శాఖ అధికా రులకు దిశా నిర్దేశం చేశారు. సెప్టెంబరు ఏడో తేదీతో గడువు ముగియనుంది. కొందరు రైతులకు బయోమెట్రిక్‌లో వేలిముద్రలు పడడం లేదు. వారంతా ఇప్పుడు పథకానికి అనర్హులుగా మిగిలి పోతున్నారు. గ్రామాల్లో అందుబాటు లో లేని రైతులు వేలాది మంది ఉండడంతో వ్యవసాయ శాఖ అధికారులు తలలు పట్టుకుంటు న్నారు. కొందరు రైతులు ఉద్దేశ పూర్వకంగానే ముందుకు రావడం లేదు. ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ప్రస్తుతం బయోమెట్రిక్‌ వేయలేమన్న సమాధానం రైతుల నుంచి వస్తోంది. ఇంకొందరి రైతులు ఆచూకీ గ్రామాల్లో ఉండడం లేదు. ఒక్క రోజు గడువులో 18 వేల మంది రైతులను పీఎంకేఎస్‌వైలో నమోదు చేయడం సాధ్యం కాని పని. అందుబాటులో ఉన్నాసరే బయోమెట్రిక్‌ చేయలేరు. అటువంటిది వేరే ప్రాంతాల్లో ఉండే రైతులకు బయోమెట్రిక్‌ చేయడం అయ్యే పనికాదు. దీనిపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అందు బాటులోని రైతులకు ప్రస్తుతం అనర్హత జాబితాలో పెట్టొద్దంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.



Updated Date - 2022-09-07T06:10:50+05:30 IST