అమ్మో.. మేము..రాం!

ABN , First Publish Date - 2022-09-15T05:30:00+05:30 IST

ఒక్కప్పుడూ నరసాపురం పుర పాలక సంఘానికి మునిసిపల్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో మంచి పేరు ఉండేది.

అమ్మో.. మేము..రాం!


నరసాపురం అంటే ముందుకురాని ఉద్యోగులు
అన్ని శాఖల్లో సీట్లు ఖాళీ.. వేధింపులే కారణం...?
ఇటీవల ముగ్గురు మేస్ర్తీలపై సస్పెన్షన్‌ వేటు
ఇద్దరి కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు
బదిలీపై వెళ్లేందుకు కీలక అధికారి ప్రయత్నాలు


నరసాపురం, సెప్టెంబరు 15: ఒక్కప్పుడూ నరసాపురం పుర పాలక సంఘానికి మునిసిపల్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో మంచి పేరు ఉండేది. ఇక్కడికి బదిలీపై వచ్చేందుకు ఉద్యోగులు పోటీ పడేవారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ పోస్టింగ్‌ అంటే చాలు... నో చెప్పేస్తున్నారు. అవసరమైతే సెలవుపై వెళ్లేందుకైనా సిద్ధమతున్నారే గాని నరసాపురం వచ్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ప్రస్తుతం అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నాయి. దీంతో ఇన్‌చార్జీలతో పాలన నెట్టికొస్తు న్నారు. ఇటీవల సమావేశానికి రాలేదన్న సాకుతో ముగ్గురు శానిటరీ మేస్ర్తీలను సస్పెండ్‌ చేశారు. దీర్ఘ కాలంగా పని చేస్తున్న మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యో గులను తొలగించారు. ఏ క్షణంలో ఎవరిపై వేటు పడుతుందన్న భయం ఉద్యోగుల్లో నెలకొంది. ఇక్కడ పని చేయాలంటే రాజకీయ ఒత్తిళ్లతో పాటు వేధిం పులు, సపక్షంలో విపక్షం ఉందన్న ముద్ర పడి పోయింది. ఈ కారణాలతోనే ఇక్కడ పని చేసేం దుకు ఎవరూ రావడం లేదన్న వాదనలు విని పిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు డీఈలు బదిలీ అయ్యారు. గత ప్రభుత్వంలో పని చేసిన లక్ష్మీనారాయణ బదిలీపై ఇక్కడ నుంచి నూజివీడు వెళ్లిపోయారు. అయన స్థానంలో సూర్యప్రకాశ్‌ వచ్చి ఆరు నెలలు గడవకుండానే బదిలీ చేయించు కుని వెళ్లిపోయారు. ఆ తర్వాత శ్రీనివాసప్రసాద్‌ వచ్చారు. ఆయన ఐదు నెలల్లోనే మరో చోటుకు బదిలీ చేయించుకున్నారు. అనంతరం పాలకొల్లు డీఈ విజయకుమార్‌ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇటీవల బదిలీల్లో ఆయన తాడేపల్లిగూడెం వెళ్లిపోయారు. ఆయన స్థానంలో రమేష్‌ను డీఈగా నియ మించగా ఆయన ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. మూడు నెల లుగా డీఈ కోసం ఎదురు చూశారు. కొత్త వారిని తీసుకొచ్చేందుకు ప్రయ త్నాలు చేశారు. అయితే ఎవరూ రాకపోవడంతో చివరికీ ఏఈ మణికి ఎఫ్‌ఈసీ ఇచ్చారు. ఇంజనీరింగ్‌ డిపార్టు మెంట్‌లో ముగ్గురు ఏఈలు ఉండా లి. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భీమవరం నుంచి ఒక ఏఈకి పోస్టింగ్‌ ఇచ్చారు. ఆయన వచ్చేందుకు ఆసక్తి చూప లేదు. ప్రస్తుతం ఇద్దరు ఏఈలు ఉండగా వారిలో ఒకరూ ఇన్‌చార్జి డీఈ అయ్యా రు. దీంతో ఒక్క ఏఈనే విధులను నిర్వహించాల్సి వస్తోంది. ఇక టౌన్‌ ప్లానింగ్‌ పేరు చెప్పితేనే బెంబేలెత్తిపోతున్నారు. టీపీవోగా ఎవరొచ్చినా పట్టు మని ఏడాది ఉండడం లేదు. ప్రస్తుతం ఆ విభాగంలో ఒక్క టీపీఎస్‌ మాత్రమే పని చేస్తున్నారు. పోస్టింగ్‌ ప్రకారం ఒక టీపీవో, ఇద్దరు టీపీఎస్‌, నలుగురు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. ఒక్క టీపీఎస్‌ మాత్రమే ఉండ డంతో అన్ని ఆయనే చక్కబెట్టాల్సి వస్తోంది. ఇక మిగిలిన శాఖల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. మరోవైపు మునిసిపాలిటీలోని కీలక అధికారి ఇక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆయన వెళ్లితే ఆపోస్టు కూడా ఇన్‌చార్జీలతోనే కొనసాగుతుందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-09-15T05:30:00+05:30 IST