India Vs Westindies : టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఏం ఎంచుకుందంటే..

ABN , First Publish Date - 2022-08-07T02:00:33+05:30 IST

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India Vs Westindies) సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

India Vs Westindies : టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఏం ఎంచుకుందంటే..

ఫ్లోరిడా : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ (India Vs Westindies) సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మైదానం కొంత తడిగా ఉండడంతో బౌలింగ్ ఎంచుకుంటున్నామని వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూర్ చెప్పాడు. ఆరంభంలో వికెట్లు పడగొట్టి టీమిండియాపై ఒత్తిడి పెంచాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... పిచ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగే చేయాలనుకున్నామని చెప్పాడు. వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమ్‌ని నిర్మించుకుంటున్న తరుణంలో జట్టులో కొంతమందికి అవకాశం ఇవ్వాలనుకున్నామని చెప్పాడు. హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ స్థానాల్లో రవి బిష్ణోయ్, అక్సర్ పటేల్, సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకున్నామని రోహిత్ శర్మ చెప్పాడు.


కాగా సిరీస్‌లో ఈ మ్యాచ్ చాలా కీలకమైనది. టీమిండియా గెలిస్తే సిరీస్‌ను చేజిక్కించుకుంటుంది. ఇక వెస్టిండీస్ గెలుపొందితే సిరీస్ సమం అవుతుంది. సిరీస్ విజేత ఎవరనేది 5వ మ్యాచ్‌లో తేలుతుంది. 


తుది జట్లు..

ఇండియా జట్టు : 1.రోహిత్ శర్మ(కెప్టెన్), 2.సూర్యకుమార్ యాదవ్, 3. రిషబ్ పంత్(వికెట్ కీపర్), 4.సంజూ శాంసన్, 5.దీపక్ హుడా, 6. దినేష్ కార్తీక్, 7.అక్సర్ పటేల్, 8.ఆవేశ్ ఖాన్, 9.భువనేశ్వర్ కుమార్, 10. రవి బిష్ణోయ్, 11. అర్షదీప్ సింగ్.

వెస్టిండీస్ జట్టు : 1. కైల్ మయర్స్, 2.బ్రండన్ కింగ్, 3. నికోలస్ పూరన్(కెప్టెన్), 4.షిమ్రోన్ హెట్మేయర్, 5. రోవ్‌మ్యాన్ పావెల్, 6.డెవొన్ థామస్(వికెట్ కీపర్), 7. జసన్ హోల్డర్, 8.అకీల్ హోసిన్, 9.డొమినిక్ డ్రేక్స్, 10.అల్జార్రీ జోసెఫ్, 11.ఒబెడ్ మెక్‌కే.

Updated Date - 2022-08-07T02:00:33+05:30 IST