West Indies vs India: వెస్టిండీస్‌తో ఫైనల్ వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ABN , First Publish Date - 2022-07-28T00:27:10+05:30 IST

వెస్టిండీస్‌తో ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకున్న అనంతరం.. ధావన్ మాట్లాడుతూ..

West Indies vs India: వెస్టిండీస్‌తో ఫైనల్ వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ట్రినిడాడ్: వెస్టిండీస్‌తో ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకున్న అనంతరం.. ధావన్ మాట్లాడుతూ.. మంచి స్కోర్ చేసి లక్ష్యాన్ని నిర్దేశించాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. అవీష్ ఖాన్ స్థానంలో ప్రసీద్ కృష్ణకు అవకాశం ఇచ్చినట్లు ధావన్ తెలిపాడు. ఈ ఒక్క మార్పు తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన ఆటగాళ్లతోనే బరిలోకి దిగనుంది. వెస్టిండీస్ పై వరుసగా 12 వన్డే సిరీస్‌లు గెలిచిన విజయోత్సాహంలో ఉన్న భారత క్రికెట్‌ జట్టు ఇప్పుడు తాజా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనుకుంటోంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన తొలి రెండు వన్డేల్లో భారత్‌ ఆఖరి ఓవర్‌లో గట్టెక్కి 2-0తో సిరీస్‌ను దక్కించుకుంది. ఓసారి బౌలింగ్‌, మరోసారి బ్యాటింగ్‌ ప్రతిభతో ధవన్‌ సేన విండీస్‌ ఆశలను ఆవిరి చేసింది.



ఇక.. విండీస్‌ ఎలాగైనా ఈ మ్యాచ్‌ను కాపాడుకోవాలనుకుంటోంది. అదే జరిగితే ఈ ఫార్మాట్‌లో తమ వరుస 8 ఓటములకు బ్రేక్‌ పడుతుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే చాన్సుంది. విండీస్‌ ఈ సిరీస్ లో 0-2తో వెనుకంజలో ఉన్నా గత మ్యాచుల్లో వారి పోరాటం ఆకట్టుకుంది. భారత బౌలింగ్‌ను ఎదుర్కొంటూ బ్యాటింగ్‌లో పూర్తి ఓవర్లు ఆడగలిగారు. అంతేకాకుండా విజయం అంచుల వరకూ వచ్చి ధవన్‌ సేనను వణికించారు. జట్టు పటిష్టంగానే కనిపిస్తున్నా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది.



వెస్టిండీస్: హోప్ (వికెట్ కీపర్), బ్రండన్‌ కింగ్‌, క్యార్టీ, బ్రూక్స్‌, నికోలస్ పూరన్(కెప్టెన్), మేయర్స్, హోల్డర్, కీమో పాల్, హొస్సేన్‌, హేడెన్ వాల్ష్, సీల్స్


టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, చాహల్, ప్రసీద్ కృష్ణ

Updated Date - 2022-07-28T00:27:10+05:30 IST