కోల్‌కతా: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-విండీస్ జట్లు మరికాసేపట్లో రెండో మ్యాచ్‌లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మరోమాటకు తావులేకుండా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. విండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన.. తొలి టీ20లోనూ విజయం సాధించి 1-0 ఆధిక్యం సాధించింది. ఇప్పుడీ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
మరోవైపు, ఈ మ్యాచ్‌లో గెలవడం వరుస ఓటములకు బ్రేక్ వేయాలని విండీస్ పట్టుదలగా ఉంది. కాగా, భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, విండీస్ ఒకే ఒక్క మార్పు చేసింది. ఫాబియన్ స్థానంలో జాసన్ జట్టులోకి వచ్చాడు.
ఇవి కూడా చదవండి