Abn logo
Mar 4 2021 @ 00:01AM

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ఒక సర్పంచ్‌, 21 వార్డులకు 15న ఎన్నికలు

ఏలూరు సిటీ, మార్చి 3 : గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిలిచిపోయిన ఒక సర్పంచ్‌, 21 వార్డులకు ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూలు విడుదల చేసింది. గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించడంతో సర్పంచ్‌తో పాటు 12 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. అలాగే వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన తాడిచర్ల 1వ వార్డు (కామవరపుకోట), ఇటికలకోట 7వ వార్డు (పోలవరం), ఎల్‌వీఎన్‌ పురం 1వ వార్డు (భీమవరం), పాత 5వ వార్డు (నరసాపురం), కొండేపూడి 4వ వార్డు (పాలకోడేరు), ఓడూరు 4వ వార్డు (పెనుమంట్ర), ఉనకరమిల్లి 8వ వార్డు(నిడదవోలు), కలకుర్రు 8వ వార్డు(ఏలూరు), పెరుగుగూడెం 9వ వార్డు (దెందులూరు)కు ఆరో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 7న పరిశీలన, 8న అభ్యంతరాల స్వీకరణ, 10న నామినేషన్ల ఉపసంహరణ, 15న పోలింగ్‌, కౌంటింగ్‌ జరుగుతుంది.

Advertisement
Advertisement
Advertisement