Abn logo
Mar 7 2021 @ 22:46PM

మహిళల రక్షణ బాధ్యత పోలీసులదే : డీఎస్పీ

తాడేపల్లిగూడెం రూరల్‌ , మార్చి 7 : మహిళల సంపూర్ణ రక్షణ పోలీస్‌ బాధ్యత అని డీఎస్పీ బి.శ్రీనాథ్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. మహిళా సంఘాలు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, పోలీసులు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు ఆకుల రఘు, వీరా రవికుమార్‌, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement