ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడిలోని ఓ ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు. ఇంటి కుటుంబ సభ్యులు గత రాత్రి వివాహానికి వేరే ఊరు వెళ్లారు. ఇదే సమయంలో ఆగంతకులు ఆ ఇంటి కిటికీ తొలగించి బీరువాలు పగులకొట్టి బంగారం, నగదును చోరీ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.