Abn logo
Jul 12 2020 @ 15:52PM

రూ.3 వేలు కోసం ప్రాణం తీశాడు

పశ్చిమగోదారి: పెదవేగి మండలం మొండూరు వద్ద మహిళ అనూష హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితుడు ఆటో డ్రైవర్ గుజ్జుల సందీప్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడికి హతురాలికి మధ్య వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సందీప్ నుంచి  రూ.3 వేలు తీసుకుంది. తీసుకున్న డబ్బులు ఇవ్వాలని సందీప్ ఒత్తిడి చేశారు. డబ్బులు ఇవ్వలేదనే  కోపంతో అనూష  మెడ చుట్టూ చున్నీ బిగించి హత్య చేశాడు. ఈ నెల 7న పెదవేగి మండలం మొండూరు పోలవరం కుడికాల్వ గట్టు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Advertisement
Advertisement
Advertisement