ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర వైసీపీలో వర్గపోరు నెలకొంది. రెండు రోజుల క్రితం ఒక వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో విభేదాలు తలెత్తాయి. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి పదివేల నగదును అధికారులు వసూలు చేశారని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇళ్లపై శాశ్వత హక్కు ఉండేందుకు ఓటీఎస్ ద్వారా ఆ డబ్బును అధికారులు వసూలు చేసారని మరోవర్గం వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో విభేదాలకు కారణమైన ఫ్లెక్సీలను అధికారులు తొలగించి వేశారు.
ఇవి కూడా చదవండి