బదిలీ టీచర్లకు ఉత్తర్వుల జారీ ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-14T05:05:49+05:30 IST

బదిలీ అయిన టీచర్లకు ఉత్తర్వుల జారీ బుధవారం ప్రారంభమైంది.

బదిలీ టీచర్లకు ఉత్తర్వుల జారీ ప్రారంభం

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 13 : బదిలీ అయిన టీచర్లకు ఉత్తర్వుల జారీ బుధవారం ప్రారంభమైంది. తొలుత ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంల బదిలీ ఉత్తర్వులను విద్యాశాఖ జారీ చేసింది. ఉత్తర్వులను సీఎస్‌ఈ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని వాటిలో ఏమైనా సాంకేతిక అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఖరారైన బదిలీ స్థానాన్ని మాత్రం మార్చుకునేం దుకు వీలుండదు. కేవలం అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు మాత్రమే అవ కాశం కల్పించారు. జడ్పీ యాజమాన్యంలోని గ్రేడ్‌ –2 హెచ్‌ఎంలు మినహా మిగతా అన్ని కేడర్ల ఉపాధ్యాయులకు బదిలీ ఆర్డర్లు గురువారం జారీ కానున్నాయి. బదిలీ ఆర్డర్లు అందుకున్న వారంతా అవసరమైన ధ్రువపత్రాలను ప్రస్తుతం పనిచేస్తున్న స్కూలు హెచ్‌ఎం లేదా ఎంఈవోల నుంచి తీసుకుని నూతన స్థానాల్లో రిపోర్టు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 5699 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

Updated Date - 2021-01-14T05:05:49+05:30 IST