ఏలూరు: రాబోయే రోజుల్లో వైసీపీ పాలనను అంతం చేయాలంటే టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని టీడీపీ నేత ఎంఏ షరీఫ్ అన్నారు. గురువారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఈ మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాలని, అప్పుడే వైసీపీని ఓడించగలుగుతామని చెప్పుకొచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అనుభవలేమితో అరాచకపాలన సాగిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. రాబోయే 30 సంవత్సరాలు తామే అధికారంలో ఉండాలి, ప్రతిపక్షాలు ఉండకూడదనే ధోరణితో వైసీపీ నేతలు ఉన్నారన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని తెలిపారు. ఈ వ్యతిరేకతను ఉపయోగించుకుని వైసీపీని ఓడించడానికి మూడు పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని షరీఫ్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి