ఊరంతా సంక్రాంతి

ABN , First Publish Date - 2021-01-13T06:11:27+05:30 IST

సంక్రాంతి పండుగ వచ్చేసింది. బుధవారం తొలిరోజు భోగిని ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ముస్తాబైంది.

ఊరంతా సంక్రాంతి
యువతుల సంక్రాంతి సంబరం

బంధువుల రాకతో కళకళలాడుతున్న ఊళ్లు

స్వగ్రామాలకు చేరుకుంటున్న జనం

కానరాని పిండి వంటలు.. అంతా రెడీమేడ్‌  


సంక్రాంతి పండుగ వచ్చేసింది. బుధవారం తొలిరోజు భోగిని ఘనంగా జరుపుకునేందుకు జిల్లా ముస్తాబైంది. కరోనా భయాలను అధిగమించి ఉన్నంతలో చేసుకోవాలని నిర్ణయించారు. కరోనా మహమ్మారి భోగి మంటల్లో కాలిబూడిద కావాలని కాంక్షిస్తున్నారు. దేశం నలుమూలలా ఉన్న వారంతా తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కనిపిస్తోంది.


ఏలూరు సిటీ/జంగారెడ్డిగూడెం, జనవరి 12 :  సంక్రాంతి అంటే పెద్ద పండుగ, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు వరుసగా వస్తాయి. భోగి మంటలు, చిన్నారుల భోగిపండ్ల సందడి, బొమ్మల కొలువులు, రంగవల్లులు, హరి దాసులు, గంగిరెద్దుల విన్యాసాలు, జంగమ దేవ రలు శంఖానాదాలు చేసే సందడి అంతా ఇంతా కాదు. కరోనా అనంతరం వచ్చిన పెద్ద పండుగకు ఇంటికొచ్చిన బంధువులతో లోగిళ్లన్నీ పూర్వ కళను సంతరించుకున్నాయి. పండుగను తమ స్వగ్రామం లో జరుపుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నాలుగైదు రోజులుగా జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ కిట కిటలాడాయి. చాలా కాలం తర్వాత తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలుసుకుని వారి యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు. కొత్త అల్లుళ్ల లతో చాలా ఇళ్లు సందడిగా మారాయి. బుధవారం భోగి పండుగ కావడంతో తెల్లవారుఝామునే నాలుగు రోడ్ల సెంటర్‌లో భోగి మంటలు వేస్తున్నా రు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని హెచ్చ రికలు జారీ చేస్తున్నా సందడి మామూలుగానే ఉంది. భోగి సందర్భంగా వైష్ణవాలయాల్లో గోదాదేవి కల్యాణాన్ని నిర్వహిస్తారు. సంక్రాంతి అంటే దేవాల యాల్లోను, ఇళ్ళల్లోను ప్రత్యేక పూజలు నిర్వహిం చడం, పెద్దలకు నైవేధ్యాలు పెడతారు. దక్షిణా యనం నుంచి మళ్ళీ ఉత్తరాయణం పయనమయ్యే సూర్యుడు సంక్రాంతి రోజునే ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. అందుకే ఈ పండు గను మకర సంక్రాంతి అంటారు. కనుమ పశువుల పండుగ. రైతన్నల ఇల్లు ఽధాన్యంతో నిండుగా ఉండి సిరులు కురిపిస్తుంటాయి. 


సంక్రాంతి పండుగ అంటే ముందు గుర్తుకు వచ్చేది పిండి వంటలు. పండుగకు ఇంటికొచ్చే చుట్టాలు, ఇరుగు పొరుగు వారికి పిండి వంటలతో శుభాకాంక్షలు తెలిపేవారు. అరెసలు, పోకుండలు, సున్నుండలు, పొంగడాలు, జంతికులు, బూంది వంటి పిండి వంటకాలు పండుగకు వారం పది రోజుల ముందు నుంచే వండేవారు. పండుగకు ఇంటికి వచ్చే అల్లుడ్లు, కూతుళ్లు, బంధువులు, తెలి సిన వారు ఇలా ఎవరొచ్చినా వారికి అల్పాహారంగా వీటితో స్వాగతం పలికేవారు. కుటుంబంలోని మహిళలంతా వంటకాల పనిలో పడితే పొరుగింటి మహిళలు వచ్చి సహాయపడేవారు. నేటి బిజీ కాలంలో ఇళ్ళల్లో  పిండి వంటకాలే జరగడం లేదు. నేరుగా పండుగకు ఒక రోజు ముందు స్వీట్‌ స్టాల్‌కు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. 


పండుగకు ఊరెళుతుండగా.. దోచేశారు

పెంటపాడు, జనవరి 12 : రోడ్డు పక్కన పార్క్‌ చేసిన కారు అద్దం పగులకొట్టి బంగారం, విలువైన వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన అలంపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. హైదరాబాద్‌కు చెందిన లోకావరపు వెంకటరమణసంక్రాంతి పండుగకు విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని లింగాలపాలెం గ్రామానికి తన భార్య, కుమారుడు, కుమార్తెలతో కారులో బయలుదేరాడు. మంగళవారం అలంపురం జాతీయ రహదారిపై ఉన్న కార్తికేయ డాబా హోటల్‌లో భోజనం చేసేందుకు కారును పక్కన పార్క్‌ చేశారు. భోజనం చేసి వచ్చి చూడగా కారు వెనుక సీటు పక్కన ఉన్న అద్దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగులకొట్టి బ్యాగ్‌లో ఉన్న 14 కాసుల బంగారం, రెండు సెల్‌ఫోన్‌లు తదితర ఎలక్ర్టికల్‌ పరికరాలు చోరీ చేసి ఉడాయించారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ కొప్పిశెట్టి శ్రీనివాసరావు తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


 కోఢీ..కొట్టేనా..?

కాలు దువ్వుతున్న పందెం కోళ్లు.. 

అణిచివేస్తామంటున్న పోలీసులు

మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర

కోడి పందేలు జరుగుతాయా.. ? ఈ ప్రశ్నకు సమాధానం కొద్ది గంటల్లోనే తేలనుంది. ఓ పక్క పోలీసులు కోడి పందే లు నిర్వహిస్తే తాట తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అక్క డక్కడా ఏర్పాటుచేసిన పందేల బరులను ధ్వంసం చేయడం తోపాటు అనేకమందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. వేల కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్ళలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. సంక్రాంతి పండుగకు కోడి పందేలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఊళ్ళలో పహారా కాస్తున్నారు. అయితే ప్రతి ఏడాది పండుగ రోజుల్లో పోలీసుల హడావుడి ఇలాగే ఉం టుందని, పందేలు జరుగుతాయని పందెం రాయుళ్లు ధీమా తో ఉన్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోటీలు ఉంటాయన్న నమ్మకంతో పందెం రాయుళ్లు ఉన్నారు. ఈ ఏడాది తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెద్ద బరులులేవు. ఉంగుటూరు నియోజకవర్గంలో గత ఏడాది బరివేశారు. ఈ ఏడాదైనా అనుమతి లభిస్తుందని ఆశించా రు. కానీ వైసీపీ సానుభూతిపరులు, నాయకులకే అవకాశం ఇచ్చారు.  భీమవరం మండలంలో  కోడిపందాలు నిషేధం, జూదాలు నేరం బ్యానర్లు కనిపిస్తున్నాయి. చాటుమాటున బరుల ఏర్పాటు చేస్తున్నట్లే కనిపిస్తోంది.. గతంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద అధికార యంత్రాంగం నిఘా పెట్టారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో బరి ఏర్పాట్లు జరగకపోయినా అప్పటికప్పుడు బరులు ఏర్పాటు చేసుకునేలా అన్ని సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. భీమవరం, వీరవాసరం, పాల కోడేరు, కాళ్ళ, ఉండి, ఆకివీడు, మొగల్తూరు, యలమంచిలి, పాలకొల్లు, పోడూరు, పెనుమంట్ర, గణపవరం వంటి మం డలాల్లో స్థలాలను శుభ్రం చేసే పని చేపట్టారు. జిల్లాలో సుమారు 50 ప్రాంతాలలో చేసిన ఏర్పాట్లను పోలీసులు తొలగించారు. ఒకచోట తొలగిస్తూ ఉంటే మరో ప్రాంతం లో బరులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే కోడి గెలు స్తుందా..? ఖాకీ గెలుస్తుందా..? అనేది వేచి చూద్దాం.

– ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌




Updated Date - 2021-01-13T06:11:27+05:30 IST