ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపుతప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి