రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం రూ. 3,950 కోట్లు

ABN , First Publish Date - 2021-01-21T04:06:50+05:30 IST

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ప్రభుత్వానికి రూ.3950 కోట్లు ఆదాయం వచ్చినట్టు రాష్ట్ర అడిషనల్‌ ఐజీ ఎం.ఉదయ భాస్కరరావు తెలిపారు.

రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం రూ. 3,950 కోట్లు
స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ రాష్ట్ర అడిషనల్‌ ఐజీ ఎం.ఉదయ భాస్కరరావు

రాష్ట్ర అడిషనల్‌ ఐజీ ఉదయ భాస్కరరావు

భీమవరం అర్బన్‌, జనవరి 20 : స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా ప్రభుత్వానికి రూ.3950 కోట్లు ఆదాయం వచ్చినట్టు రాష్ట్ర అడిషనల్‌ ఐజీ ఎం.ఉదయ భాస్కరరావు తెలిపారు. భీమవరం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో బుధవారం రికార్డులు తనిఖీ చేసి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం అందించే శాఖల్లో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మూడో స్థానంలో ఉందని అన్నారు. సుమారు రూ. 5 కోట్ల నిధులతో ఈ ఏడాది రాష్ట్రంలో 4 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మిస్తామ న్నారు. జిల్లాలో పెనుగొండ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం నూతనంగా నిర్మిస్తామని తెలిపారు. ఈ ఏడాది శాఖ ఆదాయ లక్ష్యం రూ.6,336 కోట్లు కాగా ఇప్పటి వరుకు సుమారు రూ. 3,950 కోట్లు వచ్చిందన్నారు. గతేడాది డిసెంబరు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 421 కోట్లు ఆదాయం వస్తే ఈ ఏడాది డిసె ంబరు నెలలో రూ.599 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం జిల్లా రిజిస్ట్రార్‌ జానకీదేవి, భీమవరం సబ్‌ రిజిస్ట్రార్‌ ఎ.వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T04:06:50+05:30 IST