మే నెలాఖరుకు రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి

ABN , First Publish Date - 2021-01-21T04:04:47+05:30 IST

విజయవాడ నుంచి నరసాపురం వరకూ రైల్వే డబ్లింగ్‌ విద్యుద్దీకరణ పనులు ఈ ఏడాది మే నెలాఖరుకు పూర్తవుతాయని రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రామ్‌ కృపాల్‌ అన్నారు.

మే నెలాఖరుకు రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి
ఉండిలో రైల్వే ట్రాక్‌ను పరిశీలిస్తున్న రామ్‌ కృపాల్‌

 రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రామ్‌ కృపాల్‌

ఆకివీడు/ ఉండి, జనవరి 19 : విజయవాడ నుంచి నరసాపురం వరకూ రైల్వే డబ్లింగ్‌ విద్యుద్దీకరణ పనులు ఈ ఏడాది మే నెలాఖరుకు పూర్తవుతాయని రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రామ్‌ కృపాల్‌ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో  బుధవారం విద్యుత్‌ రైల్‌ ప్రారంభించి మాట్లాడారు. విజయవాడ నుంచి భీమవరం వరకూ రైల్వే డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. భీమవరం నుంచి నరసాపురం వరకూ మే నెలలో విద్యుద్దీకరణ పనులు పూర్తి చేసి రైళ్లు నడపడం జరుగుతుందన్నారు. ప్రస్తుతానికి విజయవాడ నుంచి భీమవరం వరకూ గుడ్స్‌ రైళ్లు నడుపు తున్నామన్నారు.విజయవాడ రైల్వే డీఆర్‌ఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరోనా వల్ల ఆగిన రైళ్లు 60 శాతం పునరు ద్ధరించినట్టు తెలిపారు.మిగిలిన రైళ్ళు త్వరలో ప్రారంభిస్తామన్నారు.ఆయన వెంట సీనియర్‌ డీవోఎం ఆంజనేయలు, స్టేషన్‌ మేనేజర్‌ వి.మాణిక్యం ఉన్నారు.

Updated Date - 2021-01-21T04:04:47+05:30 IST