కనుల పండువగా ప్రభల తీర్థం

ABN , First Publish Date - 2021-01-16T05:51:20+05:30 IST

మండలంలోని కందరవల్లిలో శుక్రవారం ప్రభల తీర్థం కనుల పండువగా సాగింది.

కనుల పండువగా ప్రభల తీర్థం
ఆచంట మండలం కందరవల్లిలో ప్రభల తీర్థం

ఆచంట, జనవరి 15: మండలంలోని కందరవల్లిలో శుక్రవారం ప్రభల తీర్థం కనుల పండువగా సాగింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కనుమ రోజున ప్రభల తీర్థం నిర్వహించడం ఆనవాయితీ. కోడేరు, కందరవల్లి, కరుగోరుమిల్లి, వల్లూరు, పెనుమంచిలి గ్రామాల ఆలయాల నుంచి ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఇక్కడ ఉంచుతారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రభలను దర్శించుకున్నారు.


గుంపర్రులో ప్రభల సంబరాలు


యలమంచిలి : మండలంలోని గుంపర్రు మారెమ్మ, గంగానమ్మ జాతర సందర్భంగా శుక్రవారం ప్రభల ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పలు గ్రామాల నుంచి భక్తులు వచ్చి ప్రభల ఊరేగింపును ఆసక్తిగా తిలకించారు. యలమంచిలి పుంతల ముసలమ్మ జాతర గురు వారం రాత్రి వైభవంగా జరిగింది. గరగల నృత్యాలు, మేళతాళాలతో, బాణాసంచాలతో అమ్మవారి గ్రామోత్సవం జరిపారు.

Updated Date - 2021-01-16T05:51:20+05:30 IST