ప.గో. జిల్లా: జీలుగుమిల్లిలో అమానుష ఘటన

ABN , First Publish Date - 2022-03-08T16:33:06+05:30 IST

ప.గో.జిల్లా: జీలుగుమిల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది.

ప.గో. జిల్లా: జీలుగుమిల్లిలో అమానుష ఘటన

ప.గో.జిల్లా: జీలుగుమిల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తమ పొలాన్ని గిరిజనేతరులకు కౌలుకు ఇవ్వలేదని ఓ గిరిజన కుటుంబాన్ని ఆ గ్రామ పెద్దలు వెలివేశారు. ఆ కుంబానికి గ్రామంలో ఎవరూ సహాయం చేయవద్దని ఆదేశించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే రూ. 10వేలు జరిమాన విధిస్తామని గ్రామ, కులపెద్దలు చెప్పడంతో రెండు నెలలుగా ఆ కుటుంబం నరకం అనుభవిస్తోంది.


జీలుగుమిల్లి పంచాయతీ, చంద్రమ్మ కాలనీకి చెందిన శ్రీరాములు కుటుంబాన్ని ఆ గ్రామం వెలివేసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన బి పట్టా భూమిలో రాములు కుటుంబం 16 ఏళ్లుగా పామాయిల్ సాగు చేసుకుంటోంది. ఆ భూమిని ఎవరికీ కౌవులుకు ఇవ్వరాదని నిబంధన ఉన్నా.. గ్రామస్తులంతా కలిసి భూమిని గిరిజనేతరులకు కౌలుకు ఇవ్వాలని చెప్పారు. అందుకు నిరాకరించడంతో ఆ కుటుంబంపై గ్రామ పెద్దలు కక్ష్యకట్టి కులం నుంచి సామాజికంగా బహిష్కరించారు. ఆ కుటుంబాన్ని ఎవరూ కూలి పనికి కూడా పిలవద్దని ఆదేశించారు. ఎలాంటి సహకారం చేయొద్దని, పాలు, సరుకులు ఇవ్వకూడదని హుకూం జారీ చేశారు. తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం జిల్లా కలెక్టరుకు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది.

Updated Date - 2022-03-08T16:33:06+05:30 IST