మెడికల్‌ కళాశాల భూసేకరణ వేగవంతం

ABN , First Publish Date - 2021-03-08T04:14:22+05:30 IST

పాలకొల్లు మండలంలో 214 జాతీయ రహదారిని చేర్చి దగ్గులూరు, లంకలకోడేరు గ్రా మాల మధ్య ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది.

మెడికల్‌ కళాశాల భూసేకరణ వేగవంతం

30 ఎకరాలు ఇచ్చేందుకు రైతుల సుముఖత

విముఖత వ్యక్తం చేసిన రైతులతో సబ్‌ కలెక్టర్‌ ముఖాముఖి

పాలకొల్లు, మార్చి 7 : పాలకొల్లు మండలంలో 214 జాతీయ రహదారిని చేర్చి దగ్గులూరు, లంకలకోడేరు గ్రా మాల మధ్య ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే పలువురు రైతులు తమ భూమివ్వడానికి అంగీకారం తెలిపారు. మరికొందరు రైతు లు భూ సేకరణకు విముఖత చూపిస్తున్నారు.ఈ మేరకు నరసాపురం సబ్‌ కలెక్టర్‌ విశ్వ నాథన్‌ ఆదివారం సంబంధిత రైతులతో సమావేశం నిర్వహి ంచారు.ప్రభుత్వ వైద్య కళా శాల ఏర్పాటుకు రైతులు సహకరించాలన్నారు. భూమిని స్వచ్ఛందంగా ఇచ్చే రైతులకు ప్రభు త్వం ప్రోత్సా హక నగదు సైతం ఇస్తు ందన్నారు. రైతులు భూ సేక రణకు సహకరిం చాలని సబ్‌ కలెక్టర్‌ విశ్వ నాథన్‌ కోరా రు. 


ఎకరాకు రూ. 50 లక్షలు

30 ఎకరాలకు సంబంధించి రైతులు భూమి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టు జిలా స్థాయి రెవెన్యూ అధికారుల ద్వారా తెలు స్తోంది. మిగిలిన రైతులు అంగీకారం తెలిపితే రెండు, మూడు నెలల్లోనే కళాశాల ఏర్పాటు ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్డు వేల్యూ, 150 శాతం అధిక ధర, మరో 5 శాతం ప్రోత్సాహక ధరతో కలుపుకుని రైతులకు ఎకరానికి సుమారు రూ.50 లక్షలు లభించే అవకాశం ఉంది.  వైద్య కళాశాలకు భూమిచ్చే రైతులకు నోటిఫి కేషన్‌ విడుదల చేసిన రెండు నెలల్లోపుగానే సొమ్ములు చెల్లించడం జరుగుతుం దని జిల్లా స్థాయి అధికారుల ద్వారా తెలుస్తోంది.

Updated Date - 2021-03-08T04:14:22+05:30 IST