మట్టి బకాసురులు!

ABN , First Publish Date - 2021-01-12T05:17:44+05:30 IST

మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎక్కడ మట్టి కనబడితే అక్కడ వాలిపోతోంది. యథేచ్ఛగా మట్టి తరలించేస్తోంది.. అధికారులు చూడడం తప్ప పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.. ప్రస్తుతం మట్టి బకాసురుల కన్ను తాడిపూడి కాలువ గట్టుపై పడింది.. రాత్రి పగలూ తేడా లేకుండా తవ్వేస్తున్నారు. లారీలలో తరలించేస్తున్నారు. అయినా అధికారులు ఏం చేయలేకపోతున్నారు.

మట్టి బకాసురులు!
జగన్నపేట వద్ద తాడిపూడి కాలువ గట్టుపై సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు

జగ్గన్నపేట వద్ద తాడిపూడి కాలువ గట్టును కొల్లగొట్టేస్తున్నారు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎక్కడ మట్టి కనబడితే  అక్కడ వాలిపోతోంది. యథేచ్ఛగా మట్టి తరలించేస్తోంది.. అధికారులు చూడడం తప్ప పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.. ప్రస్తుతం మట్టి బకాసురుల కన్ను తాడిపూడి కాలువ గట్టుపై పడింది.. రాత్రి పగలూ  తేడా లేకుండా  తవ్వేస్తున్నారు. లారీలలో తరలించేస్తున్నారు.                   అయినా అధికారులు ఏం చేయలేకపోతున్నారు. 

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మట్టి మాఫియా బుసలు కొడుతోంది.తాడిపూడి కాలువ గట్టును గుల్ల చేస్తోంది. ప్రభుత్వ ఆదాయా నికి గండి కొడుతోంది. రూరల్‌ మండలం జగ్గన్నపేట గ్రామ పరిధిలో కాలువ గట్టును యంత్రాలతో తొలగించి లారీల్లో తరలిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల మెరకకు ఉపయో గిస్తున్నారు.పనిలో పనిగా ప్రైవేటు భూముల్లో వెం చర్లకు తరలిస్తున్నారు. నియోజకవర్గంలోని ముఖ్య రాజకీయ నేత అండదండలతో అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు.


కాలువ గట్టును గుల్ల చేస్తున్నారు..

ప్రభుత్వం ఇళ్ల స్థలాల మెరక బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. అందుకు తగ్గట్టుగా బిల్లులు మంజూరు చేస్తో ంది. మట్టితో ధరతో సహా, రవాణా చార్జీలను లెక్కించి ఇళ్ల స్థలాల మెరకకు సొమ్ములు చెల్లిస్తున్నారు. మట్టి మాఫియా మాత్రం కాంట్రాక్ట్‌ పనులు దక్కించుకుని కాలువ గట్లను కుం గదీస్తోంది. గతంలో ఎర్రకాలువ గట్టును గుల్ల చేశారు. ప్రభుత్వం పేరుతో ప్రైవేటు అవసరాలకు వాడుకున్నారు. ఇప్పుడు తాడిపూడి కాలువపై పడ్డారు. జగ్గన్నపేట వద్ద ఉన్న కొద్దిపాటి గట్టును తరలించేస్తున్నారు. నాలుగు యంత్రాలతో రాత్రి, పగలు తవ్వకాలు సాగిస్తున్నారు. తాడేపల్లిగూడెం పరిధిలో ఉన్న ఇళ్ల స్థలాలను మెరక చేస్తున్నారు. ప్రైవేటు అవసరాలకు దారిమళ్లిస్తున్నారు. 


అధికారులు ఆదేశించినా..ఆగడంలేదు..

ఇళ్ల స్థలాలు మెరక చేయడంలో అధికార పార్టీకి చెందిన వారే కాంట్రాక్టులు దక్కించుకున్నారు. అందులో ముఖ్య రాజకీయ నేతకు వ్యక్తిగత అనుచరులు ఉన్నారు. అందువల్లే అనుమతుల్లేకుండా తాడిపూడి కాలువ గట్టును తవ్వే సాహ సానికి మాఫియా ఒడిగట్టింది. అక్రమ తవ్వకాలపై నీటిపారుదల శాఖ అధికారు లకు ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో అక్రమ తవ్వకానికి ఒడిగడుతున్న ప్రాంతాన్ని క్షేత్ర స్థాయి అధికారులు పరిశీలించారు. గట్టు తవ్వకాన్ని నిలిపివేయాలని ఆదేశిం చారు. అయినా సరే మాఫియా ఆగడం లేదు. ఎప్పటిలాగే తవ్వకాలు సాగిస్తోంది. 


అనుమతులిచ్చే వీలున్నా...

ఇరిగేషన్‌ అధికారులను సంప్రదిస్తే అనుమతులు మంజూరు చేస్తారు. ఉంగుటూరు నియోజక వర్గంలో అదే మాదిరిగా తవ్వకాలు సాగిస్తు న్నారు. ప్రభుత్వ అవసరాలకోసమైనా, ప్రైవేటు భూముల మెరక చేసేందుకైనా మిగులుమట్టిని ఇచ్చేందుకు నీటి పారుదల శాఖకు అధికారం ఉంది.  కేవలం మట్టి అయితే క్యూబిక్‌ మీటర్‌కు రూ.65లు వసూలు చేస్తున్నారు. అదే కంకరమట్టికి రూ.103లు చెల్లిం చాల్సి ఉంటుంది. ఆ సొమ్మంతా ప్రభుత్వ ఖజానాలో  జమ అవుతుంది. మిగులు మట్టి ఉన్న ప్రాంతంలోనే ఇలా నీటి పారుదల శాఖ అనుమతులు ఇస్తో ంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవ ర్గంలో మాత్రం మట్టి మాఫియా దౌర్జ న్య ంగా తవ్వకాలు సాగిస్తోంది. రాజకీయ నేత అండదండలు ఉండ డంతో రాత్రి పగలు తవ్వకాలు సాగించి తరలిస్తున్నారు. 


మా దృష్టికి వచ్చింది..

తాడిపూడి కాలువ గట్టు అక్రమ తవ్వకాల విషయం మా దృష్టికి వచ్చింది. జూనియర్‌ ఇంజనీర్‌ను పంపించాం. అనుమతు ల్లేకుండా తవ్వకాలు సాగిస్తే అడ్డుకుంటాం.  అనుమ తులు లేకుండా తవ్వకాలు సాగిస్తే చర్యలు తీసుకుంటాం. 

శేషుబాబు, ఏఈ


Updated Date - 2021-01-12T05:17:44+05:30 IST