కోఢీ.. కోట్లాట!

ABN , First Publish Date - 2021-01-13T05:30:00+05:30 IST

పందెం కోళ్లు బరుల్లోకి దిగాయి. జనం కేరింతలు కొట్టారు. జేబుల్లోంచి నోట్ల కట్టలు వెదజల్లారు. సంక్రాంతి పండుగ వేళ ఆనందం వెల్లి విరిసింది.

కోఢీ.. కోట్లాట!
నిడదవోలు మండలం డి.ముప్పవరంలో ఫ్లడ్‌ లైట్ల వెలుగులో కోడి పందేలు

చేతులెత్తేసిన పోలీసులు.. యథేచ్ఛగా పందేలు

ఊరూవాడా వెలసిన బరులు

ప్రోత్సహించిన అధికారపక్షం.. దగ్గరుండి  నిర్వహణ

ఎమ్మెల్యేల సొంత ఊళ్లలోనూ హవా

పేకాట, గుండాటతో చెలరేగిపోయారు

అమాత్యుల నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు

ఏరులై పారిన మద్యం.. కోజ మాంసానికి డిమాండ్

పందెం కోళ్లు బరుల్లోకి దిగాయి. జనం కేరింతలు కొట్టారు. జేబుల్లోంచి నోట్ల కట్టలు వెదజల్లారు. సంక్రాంతి పండుగ వేళ ఆనందం వెల్లి విరిసింది. పోలీసులపై తమదే పైచేయి అన్నట్టు తెగరెచ్చిపోయారు. బుధవారం మొదలైన పందేలు రాత్రి తెల్లవార్లూ సాగాయి. వాటి వెనుకే పేకాట.. గుండాట చోటు చేసుకున్నాయి. మద్యం ఏరులై పారింది. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ వారికి ఒకింత సాయపడ్డారు. 


(ఏలూరు – ఆంధ్రజ్యోతి): 

జిల్లావ్యాప్తంగా సాగిన కోడి పందేలు, జూదాల్లో రెచ్చి పోయారు. ఓ వైపు కరోనా అంటున్నా ఏ మాత్రం వెరవలేదు. పోలీసు భయం లేకపోవడంతో అన్ని మండలాల్లోను పందేల ను ఏకపక్షంగా నిర్వహించారు. కొద్ది రోజులుగా సంక్రాంతి పేరెత్తితేనే పోలీసులు గుర్తుకు వచ్చేవారు. అందరిని అంతలా కట్టడిచేశారు. బరులన్ని దగ్గరుండి ధ్వంసం చేసి, కోడికి కత్తి కట్టే వారిని బైండోవర్‌ చేశారు. పదిహేను వేలకుపైగా కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పందేలు వేస్తే సహించ మని వార్నింగ్‌లు ఇచ్చి హడావుడి చేసిన పోలీసు అధికారు లు, సిబ్బంది చివరకు ఎక్కడా కనిపించలేదు. పందేలకు వీల్లే దంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో కొంద రు నీళ్లొదులుకున్నారు. అధికారపక్ష నేతలు మాత్రం కార్యక ర్తల నుంచి తీవ్రంగా ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి పందేలు జరిగి తీరాలని పట్టుబట్టారు. దీనికి తగ్గట్టుగానే వచ్చే ఆదాయం పోగొట్టుకోకుండా కొందరు జాగ్రత్తపడ్డారు. వైసీపీలో ఎమ్మెల్యేలకు సన్నిహితులుగా ఉన్న వారంతా పందేల బరుల నిర్వాహకులుగా మారారు. సాధార ణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారే బరుల నిర్వాహకులుగా మారడం ఆనవాయితీ.ఈసారి అదే జరిగింది. 


కోట్లు మారాయి

భీమవరంలో దాదాపు ఐదుచోట్ల, ఉండి నియోజకవర్గం  అయిభీమవరంలో పందేల బరుల్లో గతంలో కోట్లు చేతులు మారేవి. కొందరు న్యాయస్థానాలకు ఎక్కడంతో ఇక్కడ బ్రేక్‌ పడింది. ఆ స్థానంలో ఇప్పుడు సీసలిలో పందేలు భారీ ఎత్తు న సాగుతున్నాయి. వీరవాసరం మండలం కొణితివాడ, పెదగ రువు, పెదవేగి మండలం కొండలరావుపాలెం దిబ్బగూడెం లోను, యలమంచిలి మండలం కలగంపూడిలోను జరిగే పందేలకు జనం పెద్దఎత్తున హాజరయ్యారు. ఎక్కడికక్కడ అందరి చేతుల్లోను ఐదు వందల నోటు కళకళలాడింది. చిన్నారులు సైతం రెచ్చిపోయి గుండాటలో పాకెట్‌ మనీ కింద ఇచ్చిన సొమ్మునంతా పోగొట్టుకున్నారు. నిడమర్రు మండలం మందలపర్రులో ఒక్కో పందెం లక్ష నుంచి ఐదు లక్షల వరకు సాగింది. నరసాపురం నియోజకవర్గంలో మధ్యాహ్నం వరకు పందేల బరులు ముందుకు సాగలేదు. సాయంత్రానికి సీను మారిపోయింది. ఉండి మండలం ఉండి, కోలమూరు, పుదపు ల్లేరు, చెరుకువాడ, కాళ్ల మండలం పెదఅమిరం, జక్కరం, కాళ్ల, సీసలి, పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం, ఆల మూరు, మార్టేరులో పందేలు జోరుగా సాగాయి. ఏజెన్సీలోను పందేలకు తిరుగులేకుండాపోయింది. దీనికి తగ్గట్టు అంతా జల్సా చేసుకున్నారు. గుండాట, పేకాటలతో సరదా తీర్చుకున్నారు. వార్నింగ్‌లతో ఇప్పటి వరకు గడగడలాడించిన పోలీసులు ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యారు. అధికారపక్షం దూకుడు ముందు పోలీసులు కిక్కురుమనలేదు. కొన్నిచోట్ల సంశయం ఉన్నా చివరకు పందేలు మాత్రం భారీగా సాగా యి. కోడి గెలిచిందా... పోలీసు గెలిచారా అంటూ పందేల జరిగేచోట కొందరు కోరస్‌తో పాటలు పాడారు. 


యథేచ్ఛగా డబ్బు ప్రవాహం

కోడి పందేల్లో కోట్ల కొద్ది డబ్బు ప్రవాహంలా సాగింది. మూడు గంటల వ్యవఽధిలో పదుల కోట్లు చేతులు మారాయి. తమకు స్వేచ్ఛ లభించినట్టు భావిస్తున్న వారంతా అడ్డూ అదుపు లేకుండా వ్యవహరించారు. బరుల బయట పైపందా లకు ఎగబడ్డారు. మందలపర్రు దగ్గర నుంచి కలగడంపూడి వరకు పెద్దసంఖ్యలో పందేలు సాగగా ఇంతేస్థాయిలో పందెం రాయుళ్లు డబ్బు వెదజల్లారు. గుండుగొలను పంచాయతీ కార్యాలయం వెనుక వైపు రాత్రి వేళల్లో పందేల నిర్వహ ణకు వీలుగా ఫ్లెడ్‌ లైట్లను ఏర్పాటుచేశారు. గుండాటకు రూ.8 లక్షలు, కోసు పేకాటలకు రూ.7 లక్షలతోపాటు, కోడి పందేలు వేసేందుకు నిర్వాహకులతో ముందస్తు ఒప్పందా లు చేసుకున్నారు. అధికార పార్టీ శిబిరంలో భోగి రోజున కోటికిపైగా పందేలు జరిగినట్లు సమాచారం.


కోడి పకోడి.. బ్రాండెడ్‌ మందు

పందెం బరుల వద్ద పెద్ద ఎత్తున కోడి పకోడి అమ్మకాలకు దిగారు. బ్రాండెడ్‌ మందును కొందరు సరఫరాచేశారు. నాటు కోడి మాంసానికి విపరీతమైన గిరాకీ లభించింది. ఏలూరు, చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాలలోను పెద్దఎత్తున పందేలు సాగగా, మద్యం అలాగే సరఫరా జరిగింది. 

హోటల్‌ వ్యాపారుల లబోదిబో

భీమవరం, జనవరి 13 : కరోనా మహమ్మారి దెబ్బకు హోటల్‌ వ్యాపారం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈ సంక్రాంతికి కొంతైనా నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చని యజమా నులు ఆశించారు. భీమవరం రెండో పట్టణంలో హోటళ్ళు, లాడ్జీల గదులన్నీ బుక్‌ అయ్యాయి. వన్‌టౌన్‌లో మాత్రం పోలీ సులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. రాత్రి పది గంటలకు వాహనాలపై వచ్చి హెచ్చరికలు చేస్తూ వ్యాపారాలు, దుకాణాల మూసివేస్తున్నారని యజమానులు ఆందోళన చెందుతున్నారు. 


ఎంత చేసినా.. చివరికి తప్పలేదు..!

ఏలూరు క్రైం, జనవరి 13 : పోలీసులు ఈసారి  కోడిపందేలు నియంత్రణకు ప్రయత్నాలు చేశారు. 2002లో అప్పటి ఎస్పీ కృపానంద త్రిపాఠి ఉజాలా, 2006లోఎస్పీ నరసింహమూర్తి మాత్రమే కోడి పందేలను జిల్లాలో జరగనివ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఆ తరువాత పనిచేసిన అధికారులు పందేల నియంత్రణ కు ఎన్ని చర్యలు తీసుకున్నా ఆఖరి నిమిషంలో అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లతో ఏం చేయలేక మిన్నకుండిపోయారు. ఈ ఏడాది  పది వేల కోడి కత్తులను స్వాధీ నం చేసుకుని, కోడి కత్తులు కట్టే వారిపై బైండోవర్‌ కేసులు కట్టారు. అధికార పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇదే తరుణంలో కొందరు పోలీసులు తమదైన శైలిలో మామూళ్ల వసూ ళ్ళకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో భారీ బరులే ఏర్పాటయ్యాయి. ఏ క్షణమైనా కోడి పందేలకు అనుమ తి ఇస్తారనే ధీమాతో ఉన్న వారు ముందే పోలీసులతో ఒప్పందాలు చేసుకుని మూడో కంటికి తెలియ కుండా యథేచ్ఛగా బరులను ఏర్పా టు చేసేశారు. ఏలూరు రూరల్‌ సర్కిల్‌ పరిధిలో బుధవా రం ఉదయం ఉంచి భారీ బరులతో పందేలు నిర్వహి స్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో మంగళవారం అర్ధరాత్రి నుంచే పందేలను ప్రారంభించేశారు. ఇక స్టేషన్‌లో రైటర్లు కొంతమంది వసూళ్ళబాట పట్టారు. 




Updated Date - 2021-01-13T05:30:00+05:30 IST