కో..ఢీ

ABN , First Publish Date - 2021-01-14T05:12:56+05:30 IST

ప్రతీ ఏడాది జరిగే తంతే ఈ ఏడాది జరిగింది. కోడి గెలిచింది.. పందేలు జరగనివ్వం అంటూ పోలీసులు.. రెవెన్యూ అధికారులు చేసిన హెచ్చరికలు గాలిలో కలిసిపోయాయి.

కో..ఢీ
పెంటపాడు మండలం మీనవల్లూరు బరిలో పందెం

బరి తెగించిన పందేలరాయుళ్లు

పోలీసుల హెచ్చరికలు బేఖాతర్‌

చేతులు మారిన లక్షలు

కరోనా నిబంధనలు హుష్‌కాకి

తణుకు రూరల్‌/ గణపవరం/ పెరవలి/ పెంటపాడు/ నిడదవోలు/ తాడేపల్లిగూడెం రూరల్‌/అత్తిలి/ ఉండ్రాజవరం/ ఉంగుటూరు/ భీమ డోలు/ నిడమర్రు, జనవరి 13 : ప్రతీ ఏడాది జరిగే తంతే ఈ ఏడాది జరిగింది.  కోడి గెలిచింది.. పందేలు జరగనివ్వం అంటూ పోలీసులు.. రెవెన్యూ అధికారులు చేసిన హెచ్చరికలు గాలిలో కలిసిపోయాయి. గ్రామాల్లో ఎక్కడికక్కడ బరులు వెలిశాయి. ప్రతీ బరి వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వేలాడుతూనే ఉన్నాయి.. మరో పక్కన పందేలు జరుగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల కనుసన్నల్లోనే కోడిపందేలు, గుండాట, పేకాట యఽథేచ్ఛగా సాగుతున్నాయి. మద్యం ఏరులై పారింది. లక్షల రూపాయలు చేతులు మారాయి. పట్టణాల నుంచి గ్రామాలకు ప్రజలు తరలిరావడంతో సందడిగా మారాయి.కోడి పందేల బరుల వద్ద పండుగ సందడి అంతా కనిపి స్తుంది. తణుకు, గణపవరం, పెరవలి, పెంటపాడు, నిడదవోలు, తాడేపల్లి గూడెం,అత్తిలి మండలాల్లో పందేలు జోరుగా సాగాయి.అనధికారికంగా వచ్చిన అను మతితో పండగ మూడు రోజులు పందేలకు సై అనడంతో బుధవారం నుంచి కోడిపందేలు ప్రారంభమయ్యాయి. గణపవరం మండ లంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పందేలు ప్రారంభం కావ డంతో  సాదాసీదాగానే సాగాయి.తొలి రోజు పిప్పర, మొయ్యేరు, సరిపల్లె, గ్రామా ల్లో పందాలు పేలవంగానే సాగాయి. పెరవలి మండలంలో ఐదు ప్రాం తాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహించారు.  పెరవలి, అజ్జరం, ముక్కామల, ఖండవల్లి, పి.వేమవరంలలో పందేలు జరిగాయి. మండలంలో పెంటపాడు, మీనవల్లూరు, కోరుమిల్లి, జట్లపాలెం, పడమరవిప్పర్రు గ్రామాల్లో కోడిపందేల బరులు వెలిశాయి.నిడదవోలు మండలం డి.ముప్పవరం, కోరుమామిడి, నిడదవోలు, తిమ్మరాజుపాలెం తదితర గ్రామాల్లో భారీగా కోడిపందేలు బరులు సిద్ధమయ్యాయి. జిల్లాలో భీమవరం తరువాత కోడి పందేలకు ప్రసిద్ధి నిడదవోలు మండలం శింగ వరం గ్రామం. భారీ స్ర్కీన్‌లతో లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తూ ప్రజా ప్రతినిధుల నుంచి సినీనటుల వరకు కూర్చుని ఆస్వాదిస్తూ వీక్షించేలా నోట్ల కట్టలు బెట్టింగులతో భారీ హంగామా జరిగేది. కరోనా కారణంగా ఈ సారి మాత్రం పందేలకు బ్రేక్‌ ఇచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణం, మండలంలో భారిగా బరులు వెలిశాయి. అత్తిలి మండలంలో నువ్వా.. నేనా అన్న రీతిలో కోడిపందేలకు ఏర్పాట్లు చేశారు.భీమడోలు మండలంలో సంక్రాంతి సంప్రదాయ కోడిపందేల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మా రాయి. గుండుగొలను, భీమడోలు, పోలసానపల్లి, కురెళ్ళగూడెం తదితర గ్రామాల్లో యథేచ్ఛగా కోడిపందేలు, కోసు పేకాటలు నిర్వహించారు. అధికార పక్షం భోగి రోజు ముందు రాత్రే పందేలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు.ఇదిలా ఉంటే గుండుగొలనులో మరో వర్గం  ఏర్పాటు చేసిన పందెం శిబిరంలో పందాలు లేక వెలవెలబోయింది. 


మందలపర్రు బరిలో పోటాపోటీగా...

నిడమర్రు మండలంలో ఏకైక ప్రధాన బరిగా మందలపర్రు దూసుకుపోతుంది. పరిసర గ్రామాల్లో కోడిపందేల బరులకు సరైన జోడీలు కలవక కోడిపందేల నిర్వహణ కష్టతరమైంది. ఈ నేపథ్యంలో పందెగాళ్లంతా మందలపర్రుకు పయనమయ్యారు. దీంతో ఈ బరికి డిమాండ్‌ పెరిగింది. బరిలో రూ. లక్ష నుండి రూ. 5 లక్షల వరుకూ పందేలు సాగుతుండగా చుట్టు పక్కల వారు మరో రూ.5 లక్షల వరకూ పైపందేలు కాస్తున్నారు. 

Updated Date - 2021-01-14T05:12:56+05:30 IST