వైభవంగా గోదాదేవి కల్యాణం

ABN , First Publish Date - 2021-01-14T05:18:09+05:30 IST

కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాల్లో చివరి రోజు, భోగి పండుగ పురస్కరించుకొని బుధవారం గోదా రంగనాథస్వామి శాంతి కల్యాణం వైభవంగా జరిగింది.

వైభవంగా గోదాదేవి కల్యాణం
కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి

కాళ్ళ, జనవరి 13 : కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాల్లో చివరి రోజు, భోగి పండుగ పురస్కరించుకొని బుధవారం గోదా రంగనాథస్వామి శాంతి కల్యాణం వైభవంగా జరిగింది. చుట్టు పక్కల గ్రామాల భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు పర్యవేక్షించారు. అనంతరం ప్రసాద వితరణ చేపట్టారు.


మొగల్తూరు: మొగల్తూరులోని పురాతన రుక్మిణీ సత్యభామా సమేత రాజగోపాలస్వామి ఆలయంలో గోదా సహిత రంగనాయక స్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎనిమిది మంది దంపతులతో ఆలయ అర్చకులు సుదర్శనం లక్ష్మీ నర్సింహ చార్యులు, రామశేషాచార్యులు, రామకుమార్‌ ఆచార్యుల కల్యాణ మహోత్సవాన్ని కనులవైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.


పాలకొల్లు అర్బన్‌: పట్టణంలోని పలు ఆలయాల్లో గోదా కల్యాణం నిర్వహించారు. అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయం లో అర్చకులు కర్రి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో కల్యాణం నిర్వహించారు. ఆలయ ఈవో పీటీ.గోవిందరావు ఏర్పాట్లు పర్యవేక్షిం చారు. కెనాల్‌ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయం, రంగమన్నారు పేట పాండురంగస్వామి, శంభన్నఅగ్రహారం వేంకటేశ్వ రస్వామి, ఎర్రవంతెన వద్ద శ్రీకృష్ణాలయంలో గోదాదేవి కల్యాణం వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు.


యలమంచిలి : మండలంలోని వైష్ణవాలయాలు, రామాల యాలు, వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, గోదాదేవి కల్యాణం నిర్వహించారు. గుంపర్రు వేంకటేశ్వరస్వామి, దొడ్డిపట్ల కేశవస్వామి, అబ్బిరాజుపాలెం, యలమంచిలి, కాజ నరేంద్ర స్వామి ఆలయాల్లో స్వామి, అమ్మవార్లను ప్రత్యేక వేదికలపై అలంకరించి, కల్యాణోత్సవాలను అర్చకులు నిర్వహించారు.

Updated Date - 2021-01-14T05:18:09+05:30 IST