ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మల్లీశ్వరి హోమ్స్ అపార్ట్మెంట్లో దొంగల భయం నెలకొంది. గత కొద్దికాలంగా అపార్ట్మెంట్లో ముగ్గురు దొంగలు అద్దెకుంటున్నారు. అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు ఫ్లాట్ తలుపులు, అద్దాలు పగలగొట్టి ఓ దొంగను, మరో మహిళను తీసుకెళ్లారు. వీరు తడికలపూడిలో జరిగిన భారీ చోరీ నిందితులుగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.